Kiran Abbavaram: ‘సంబరాల ఏటిగట్టు’ ముందు నా కథే.. ఎందుకు తప్పుకున్నానో చెప్పిన హీరో

కిరణ్ అబ్బవరం తన సరికొత్త సినిమా ప్రమోషన్లో ‘సంబరాల ఏటిగట్టు’ విషయంలో తను ఎందుకు తప్పుకున్నాడో చెప్పడం ఇంట్రెస్టింగ్ గా ఉంది. ప్రస్తుతం ‘చెన్నై లవ్ స్టోరీ’తో బిజీగా ఉన్న ఈ యంగ్ హీరో, ఇప్పటికే ‘సంబరాల ఏటిగట్టు’ కథ తనకోసమే వచ్చిందని క్లారిటీ ఇచ్చేశాడు.

సంబరాల ఏటిగట్టు: రోహిత్ టాలెంట్ బలం

దర్శకుడు రోహిత్ 2021లో తనను కలిసి చిన్న బడ్జెట్ కథ వినిపించాడట. కానీ ఆయనలో టాలెంట్ చూసి పెద్ద కాన్సెప్ట్ తో రావాలని కిరణ్ సూచించాడు. ఆ తర్వాత రోహిత్ ‘సంబరాల ఏటిగట్టు’ కథతో వచ్చాడు. కథ నచ్చడమే కాకుండా, ‘హనుమాన్’ నిర్మాత నిరంజన్‌ను కూడా కిరణ్ పరిచయం చేశాడు. ఈ సినిమాను ప్రారంభించడానికి ఓ ప్రయత్నం చేశారు కానీ విధి వేరు.

ప్రొడక్షన్ దశలో ఉండగానే కిరణ్ కు వరుస పరాజయాలు ఎదురయ్యాయి. చిన్న బడ్జెట్ తో ప్లాన్ చేసిన ప్రాజెక్ట్ క్రమంగా రూ.60-70 కోట్లకు పెరిగింది. అప్పుడు తన మార్కెట్ కు అంత భారీ రిస్క్ సరిపోదని భావించి, తానే తప్పుకున్నట్లు చెప్పాడు. నిర్మాత నాతోనే సినిమా చేయాలనుకున్నారు కానీ నేను చెప్పా వద్దు అని కిరణ్ క్లారిటీ ఇచ్చాడు.

ఇప్పుడు ఈ కథ సాయి ధరమ్ తేజ్ తో రూపొందుతుండటం చూసి కిరణ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. రోహిత్ ని సాయితో మ్యాచ్ చేయడానికి కూడా తానే ఎంకరేజ్ చేశాడు. రూ.120 కోట్ల పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా సంబరాల ఏటిగట్టు భారీ అంచనాలు సృష్టిస్తోంది. దానికి కిరణ్ తాజా వ్యాఖ్యలు మరింత స్పైస్ ని యాడ్ చేశాయి.

Share your love