

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. జనసేన, తెలుగుదేశం అలాగే భారతీయ జనతా పార్టీలు ఏకమై కూటమిగా ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలోనే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో, జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీని ఓడించి మరి చంద్రబాబు అధికారంలోకి వచ్చాడు. CM Chandrababu
CM Chandrababu key decision on Amaravati
దీంతో వైయస్ జగన్మోహన్ రెడ్డి అనుకున్న మూడు రాజధానులు అంశం అటకెక్కింది. అమరావతిని డెవలప్ చేస్తూ చంద్రబాబు ముందుకు వెళ్తున్నారు. అయితే మళ్లీ మూడు రాజధానుల అంశం తెరపైకి రాకుండా చంద్రబాబు మరో స్కెచ్ వేశారు. అమరావతి కోసం భూములు ఇచ్చిన వాళ్లకు సహాయం చేస్తూ అడుగులు వేస్తున్నారు. రాజాగా అమరావతిలో భూమిలేని పేదల పెన్షన్లపై కీలక నిర్ణయం తీసుకుంది ఈ చంద్రబాబు కూటమి ప్రభుత్వం. దాదాపు 4929 మంది పింఛన్ల పునరుద్ధరణ పై త్రి సభ్య కమిటీ వేస్తూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. CM Chandrababu
Also Read: Kolikapudi Srinivasa Rao: ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు లీలలు…ఫోటో వైరల్ ?
గ్రామాల్లోని ఈ తమ కార్యాలయాల్లో పింఛన్ దరఖాస్తులు ఇవ్వాలని సిఆర్డిఏ వెల్లడించింది. గత వైసిపి ప్రభుత్వం ఈ పెన్షన్ల పునరుద్ధరణ కార్యక్రమాన్ని రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ పింఛన్ల పునరుద్ధరణ పై కమిటీ వేసి ముందుకు వెళ్తోంది చంద్రబాబు సర్కార్.
ఇక వాళ్లకు పెన్షన్లు ఇస్తే మూడు రాజధానుల అంశం తెరపైకి వచ్చే సమస్య లేదని అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అయినా కూడా మూడు రాజధానుల అంశం పైన ముందుకు వెళ్లే ఛాన్స్ ఉండకపోవచ్చు అని అంచనా వేస్తున్నారు. అందుకే ఒక్కొక్క పనిని చంద్రబాబు చేస్తున్నారని తెలుపుతున్నారు విశ్లేషకులు. CM Chandrababu
Also Read: Lionel Messi: మెస్సీకి ఘోర అవమానం.. కోల్‌కాతాలో మ్యాచ్ రద్దు ?







