
Jana sena: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 అసెంబ్లీ ఎన్నిక సందర్భంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. తెలుగుదేశం , జనసేన అలాగే భారతీయ జనతా పార్టీలు కలిసి ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. చంద్రబాబు నాయుడు అప్పట్లో జైల్లో పడ్డ సమయంలోనే ఈ మూడు పార్టీల మధ్య పొత్తు కుదిరింది. మోడీ సర్కార్ అధికార బలంతో ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిందని ప్రచారమైతే సాగుతోంది. ముఖ్యంగా జనసేన పార్టీ 100 స్ట్రైక్ రేట్తో మొన్నటి ఎన్నికల్లో దుమ్ము లేపింది. Jana sena
10 out of 21 Jana Sena MLAs are corrupt
21 మంది జనసేన ఎమ్మెల్యేలు విజయం సాధించారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేన ఎమ్మెల్యేలు ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటున్నారు. అవినీతిపరులుగా మారిపోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా జనసేన ఎమ్మెల్యే ల గురించి షాకింగ్ విషయం బయటపడింది. గెలిచిన 21 మంది ఎమ్మెల్యేలలో పది మంది జనసేన పార్టీ ఎమ్మెల్యేలు అవినీతిపరులేనని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ పదిమంది ఎమ్మెల్యేలు భూ అక్రమనలు, ఇసుక మైనింగ్ దందాలు చేస్తున్నారట. మరికొంతమంది మద్యం వ్యవహారాల లో అవినీతికి పాల్పడి డబ్బులు సంపాదించినట్లు ఫిర్యాదులు వచ్చాయట. Jana sena
Also Read: Kalvakuntla Kavitha: పవన్ కళ్యాణ్ పరువు తీసిన కవిత..ఆయన ఎప్పుడూ సమైక్యావాదినే
పార్టీకి అలాగే కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా జనసేన పార్టీ ఎమ్మెల్యేలు నడుచుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఈ పది మంది ఎమ్మెల్యేలపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు నివేదిక కూడా అందిందట. దీంతో రహస్యంగా 10 మంది ఎమ్మెల్యేల పనితీరుపై ఆరా తీస్తున్నారట పవన్ కళ్యాణ్. ఏ క్షణమైనా ఆ పదిమంది ఎమ్మెల్యేలపై వేటు వేసేందుకు సిద్ధమవుతున్నారట. లేదా వచ్చే ఎన్నికల్లో వాళ్లను దూరం పెట్టాలని స్కెచ్ వేసినట్లు చెబుతున్నారు. అయితే అధికారంలోకి వచ్చింది సంపాదించుకునేందుకే అంటూ ఆ పదిమంది ఎమ్మెల్యేలు స్పష్టం చేయడం గమనార్హం. ఇటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన 60 మంది ఎమ్మెల్యేలు కూడా ఇదే తంతు కొనసాగిస్తున్నారట. వీళ్ళు ఇలాగే కొనసాగితే ఏపీలో ప్రభుత్వం మారడం గ్యారంటీ అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. Jana sena
Also Read: Akhanda 2: వివాదంలో అఖండ 2 సినిమా…సీపీఐ నారాయణ వివాదస్పద వ్యాఖ్యలు ?





