CM REVANTH REDDY : అల్లు శిరీష్ పెళ్లికి హాజ‌రైన సీఎం రేవంత్ రెడ్డి

CM REVANTH REDDY : టాలీవుడ్ అగ్ర నిర్మాత‌ల్లో ఒక‌రైన అల్లు అర‌వింద్ ఇంట పెళ్లి సంద‌డి నెల‌కొంది. అల్లు అర‌వింద్ చిన్న కుమారుడు, హీరో అల్లు అర్జున్ సోద‌రుడు అల్లు శిరిష్ పెళ్లి చేసుకొని ఓ ఇంటివాడ‌య్యాడు. త‌న ప్రేయ‌సి న‌య‌నిక‌తో శిరిష్ వివాహం మార్చి 06, 2026న క‌న్నుల పండుగ‌గా జ‌రిగింది. హైద‌రాబాద్ లోని కొల్లూరు ఐనా ఈవెంట్ స్పేస్ వేదిక‌గా జ‌రిగిన వేడుక‌కు తెలంగాణ సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి హాజ‌రై నూత‌న వ‌ధూవ‌రుల‌ను ఆశీర్వ‌దించారు.

CM Revanth Reddy attended Allu Sirish’s wedding





ముఖ్యంగా అల్లు శిరీష్, న‌య‌నిక జంట‌కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పుష్ప‌గుచ్ఛం అంద‌జేసి శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా వ‌ధూవ‌రుల‌ను ఆశీర్వ‌దించారు సీఎం రేవంత్ రెడ్డి. అనంత‌రం వ‌ధూవ‌రులు, అల్లు అర‌వింద్, అల్లు అర్జున్ ల‌తో క‌లిసి సీఎం ఫొటోలకు స్టిల్ ఇచ్చారు. ఈ పెళ్లి వేడుక‌లో సినిమాటోగ్ర‌ఫీ మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డితో పాటు ప‌లువురు రాజ‌కీయ‌, సినీ ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు.

Also Read : CM CHANDRABABU-MANCHU MANOJ : సీఎం చంద్ర‌బాబు పై మంచు మ‌నోజ్ ప్ర‌శంస‌లు.. ఎందుకోసం అంటే..?

ప్ర‌ధానంగా పుష్ప 2 సినిమా స‌మ‌యంలో సంధ్య థియేట‌ర్ త‌రువాత జ‌రిగిన వివాదంలో సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ ని టార్గెట్ చేశార‌ని వార్త‌లు వినిపించాయి. కానీ తాజాగా అల్లు శిరీష్ వివాహానికి హాజ‌రు కావ‌డంతో అలాంటిదేమి లేద‌ని తేట‌తెల్లమైంది. అల్లు శిరీష్-న‌య‌నిక పెళ్లి ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి.

Also Read : MLA KOLIKAPUDI SRINIVAS RAO : ఎమ్మెల్యే కొలిక‌పూడి శ్రీనివాస‌రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. చంపేందుకు కుట్ర‌లు