
Cm Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు చాలా హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ చిన్న తప్పిదం చేసినా, గులాబీ పార్టీ సోషల్ మీడియా తెగ వైరల్ చేస్తోంది. గతంలో కంటే చాలా యాక్టివ్ అయిన గులాబీ పార్టీ సోషల్ మీడియా, కాంగ్రెస్ ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తోంది. అయితే ఈ నేపథ్యంలోనే ఏబీఎన్ రాధాకృష్ణ ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసిన సంగతి తెలిసిందే. Cm Revanth Reddy
Cm Revanth Reddy meets abn radhakrishna
ఒక ముఖ్యమంత్రి స్థాయిలో, న్యూస్ ఛానల్ ఓనర్ను కలవడం చాలా అరుదు. అలాంటిది ఎల్లో మీడియా గా పేరుగాంచిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఓనర్ను కలవడంతో గులాబీ పార్టీతో పాటు వైసిపి కూడా రెచ్చిపోతున్నాయి. అయితే వీళ్ళిద్దరి మధ్య జరిగిన సమావేశం దేని గురించి తెలియదు కానీ, కొత్త అంశాన్ని మాత్రం వైసిపి తో పాటు గులాబీ పార్టీ తెరపైకి తీసుకువచ్చాయి. ఏబీఎన్ స్టూడియో కు ఏకంగా 25 ఎకరాలు ఇచ్చేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ప్రచారం చేస్తున్నాయి రెండు పార్టీల సోషల్ మీడియాలు. Cm Revanth Reddy
Also Read: Roja: రేవంత్, చంద్రబాబుపై రెచ్చిపోయిన రోజా..రాయలసీమకు వెన్నుపోటు ?
ఫ్యూచర్ సిటీలో ఉచితంగా దాదాపు 100కోట్ల విలువైన 25 ఎకరాలు ఆంధ్రజ్యోతి కొత్త స్టూడియో కు ఇచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నాడని అంటున్నారు. అందుకే ఏబీఎన్ రాధాకృష్ణను ప్రత్యేకంగా కలిసి ఈ ఆఫర్ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చినట్లు ప్రచారం చేస్తున్నారు. దీనికి సంబంధించిన న్యూస్ ఆంధ్రజ్యోతి ఛానల్ లో వచ్చినట్లు క్లిప్ క్రియేట్ చేసి మరి రచ్చ రచ్చ చేస్తున్నారు. అయితే దీనికి సీఎం రేవంత్ రెడ్డి టీం ఎలా కౌంటర్ ఇస్తుందో చూడాలి. Cm Revanth Reddy
Also Read: Revanth Reddy: రేవంత్ రెడ్డి సర్కార్ పరువు తీసిన గుత్తా..బండారం మొత్తం బయటపెట్టాడుగా ?





