Mega Brothers: మెగా బ్రదర్స్ మధ్య గొడవలు.. అందుకే పవన్ కళ్యాణ్ దూరం..!

Conflicts between Mega Brothers

Mega Brothers: ఏంటి ఇది నిజమేనా మెగా ఫ్యామిలీలో అన్నదమ్ముల మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయా.. అందుకే పవన్ కళ్యాణ్ కాస్త దూర దూరంగా ఉంటున్నారా.. ఇంతకీ సోషల్ మీడియాలో వచ్చే ఈ రూమర్లలో ఉన్న నిజం ఎంత అనేది ఇప్పుడు చూద్దాం.. మెగా ఫ్యామిలీలో అన్నదమ్ముల మధ్య విభేదాలు వచ్చాయి అంటే ఎవరు నమ్మరు. ఒకవేళ అలాంటి విభేదాలు వచ్చినా కూడా వారు లోలోపలే వాటిని సాల్వ్ చేసుకుంటారు కానీ బయటి దాకా రానివ్వరు. అలాంటిది వీరి మధ్య గొడవలు వచ్చాయి అనడానికి రుజువు ఏంటి అని కొంతమంది కామెంట్లు కూడా పెడతారు.

Conflicts between Mega Brothers

అయితే ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్,చిరంజీవి,నాగబాబు ముగ్గురి మధ్య కాస్త మనస్పర్ధలు చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది.ముఖ్యంగా అసెంబ్లీలో బాలకృష్ణ ఎప్పుడైతే చిరంజీవిని ఉద్దేశిస్తూ వెటకారంగా మాట్లాడారో ఆ సమయంలో నాగబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు రియాక్ట్ అవ్వకపోవడంతో మెగా బ్రదర్స్ మధ్య గొడవలు మొదలయ్యాయి అనే టాక్ వినిపిస్తోంది.అన్నని చిన్న మాట అన్నా కూడా రాకెట్లా దూసుకు వచ్చే నాగబాబు, పవన్ కళ్యాణ్ లు బాలకృష్ణ అసెంబ్లీ సాక్షిగా వెటకారంగా మాట్లాడితే ఎందుకు స్పందించలేదు అనే టాక్ వినిపిస్తోంది.(Mega Brothers)

Also Read: Chiranjeevi: “అది పెద్ద గొడ్డలి పెట్టు”.. చిరంజీవి నోట ఊహించని మాట ఏం జరిగిందంటే.?

ఇక ఈ నేపథ్యంలోనే రీసెంట్ గా మెగా కోడలు ఉపాసన సీమంతం వేడుకల్లో కూడా పవన్ కళ్యాణ్ కనిపించలేదు.దీంతో మెగా బ్రదర్స్ మధ్య మనస్పర్ధలు నిజమే అని చాలామంది మాట్లాడుకుంటున్నారు. అయితే వారిద్దరి మధ్య విభేదాలు వచ్చాయనడానికి ఎలాంటి ఋజువు లేదు..ఎందుకంటే ఉపాసన శ్రీమంతం రోజు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండి రాలేకపోయారు కావచ్చు. కానీ ఆయన భార్య పిల్లలు మాత్రం శ్రీమంతం ఫంక్షన్ లో కనిపించారు.

Conflicts between Mega Brothers

ఒకవేళ నిజంగానే మెగా బ్రదర్స్ మధ్య విభేదాలు ఉంటే నాగబాబు, ఆయన భార్య కొడుకుకు కూతురు కోడలు ఎందుకు వస్తారు.. పవన్ కళ్యాణ్ భార్య ఎందుకు వస్తుంది అని చర్చ నడుస్తోంది. ఏది ఏమైనప్పటికి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలతో మాత్రం మెగా ఫ్యామిలీలో కాస్త గొడవలు జరిగాయి అనే వార్త మాత్రం ఇండస్ట్రీలో వినిపిస్తోంది.(Mega Brothers)

Share your love