
Bahubali The Epic: రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన అద్భుతమైన సినిమాల్లో బాహుబలి సినిమా ముందుంటుందని చెప్పుకోవచ్చు. ఈ సినిమాతో రాజమౌళి రేంజ్ ఒక్కసారిగా పెరిగింది. అయితే అలాంటి రాజమౌళి డైరెక్షన్ చేసిన బాహుబలి 1,బాహుబలి 2 సినిమాలు కలిపి బాహుబలి ది ఎపిక్ పేరుతో రీ రిలీజ్ చేసిన సంగతి మనకు తెలిసిందే. తాజాగా అక్టోబర్ 31 అనగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా బాహుబలి ది ఎపిక్ మూవీ విడుదలైంది. ఇక ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ లో కూడా దుమ్ము లేపింది.
Star hero fans fire on Bahubali The Epic
డైరెక్ట్ సినిమాల కంటే రీ రిలీజ్ సినిమా అయినటువంటి బాహుబలి ది ఎపిక్ మంచి కలెక్షన్స్ తో ముందుకు పోతుంది.ఈ నేపథ్యంలోనే బాహుబలి ది ఎపిక్ మూవీ కోసం కొన్ని సీన్స్ ఎడిటింగ్ లో తొలగించినట్టు చిత్ర నిర్మాతలు, డైరెక్టర్ చెప్పిన సంగతి మనం తెలిసిందే. ఇక తొలగించిన సీన్స్ లో తమన్నా ప్రేమాయణం, తమన్నా అవంతిక పాత్ర, పచ్చబొట్టేసిన సాంగ్ తో పాటు మిగిలిన కొన్ని సాంగ్స్ కూడా తీసేశారు అని తెలుస్తోంది.( Bahubali The Epic)
Also Read: Manchu Lakshmi: మంచు లక్ష్మి విడాకులు.. కలిసి ఉండడం ఇష్టం లేకే ఇండియాకి వచ్చా..!
ఈ నేపథ్యంలోనే ఓ స్టార్ హీరో ఫ్యాన్స్ అన్యాయంగా మా హీరోకి అవమానం చేశారు కదారా అంటూ మండి పడుతున్నారు. మరి ఇంతకీ బాహుబలి ది ఎపిక్ మూవీపై ఫైర్ అవుతున్న ఆ హీరో ఫ్యాన్స్ ఎవరయ్యా అంటే ..కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ ఫ్యాన్స్. ఇక బాహుబలి ది బిగినింగ్ మూవీ లో కన్నడ హీరో కిచ్చా సుదీప్ అస్లామ్ ఖాన్ అనే పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.ఈ సినిమాలో కిచ్చా సుదీప్ కట్టప్ప మధ్య ఒక బలమైన సీన్ ఉంటుంది.

కానీ ఈ సీన్ బాహుబలి ది ఎపిక్ లో తీసివేశారు. అయితే తాజాగా కన్నడ ప్రేక్షకులు బహుబలి ది ఎపిక్ మూవీ ని చూసి మండిపడుతున్నారు. కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ సీన్స్ బాహుబలి ది ఎపిక్ లో ఎలా తీసేస్తారు.. ఇది నిజంగా మా హీరోకి జరిగిన అవమానమే.. మా హీరోకి ఇంత అవమానం చేస్తారా అంటూ మండి పడుతున్నారు. అంతేకాదు సోషల్ మీడియాలో కిచ్చా సుదీప్ ఫ్యాన్స్ బాహుబలి ది ఎపిక్ లో మా హీరోకి అన్యాయం చేశారు అంటూ పోస్టులు చేస్తున్నారు. (Bahubali The Epic)





