Congress: యశస్విని రెడ్డి, ఝాన్సీ రెడ్డిపై మ‌రో ఎదురుదెబ్బ..అమెరికాకు జంప్‌ ?

Another setback for Yashaswini Reddy and Jhansi Reddy
Another setback for Yashaswini Reddy and Jhansi Reddy

Congress: పాలకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డిపై, ఆమె అత్త ఝాన్సీ రెడ్డి మ‌రో ఊహించ‌ని షాక్ త‌గిలింది. యశస్విని రెడ్డిపై, ఆమె అత్త ఝాన్సీ రెడ్డిపై అధిష్టానానికి ఫిర్యాదు చేసిన స్థానిక కాంగ్రెస్ నాయకులు..సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు అవ్వగానే అత్తాకొడల్లు తట్టా బుట్టా సర్దుకొని అమెరికాకు వెళ్లిపోయారని వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. Congress

Congress Another setback for Yashaswini Reddy and Jhansi Reddy

ఝాన్సీ రెడ్డి, యశస్విని రెడ్డిల పాలనతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని నిప్పులు చెరిగారు. సిటిజన్‌షిప్ లేని ఝాన్సీ రెడ్డి అధిష్టానాన్ని మోసం చేసి వైస్ ప్రెసిడెంట్ పదవిని తీసుకుందని ఆగ్ర‌హించారు ఝాన్సీ రెడ్డిని పదవి నుండి తొలగించాలని మీనాక్షి నటరాజన్‌కు ఫిర్యాదు చేశామ‌ని వివ‌రించారు పాలకుర్తి స్థానిక కాంగ్రెస్ నాయకులు. Congress

Also Read: Teenmar Mallanna: కవితకు కాంగ్రెస్ లో మంత్రి పదవి.. సాక్షాలు బయటపెట్టిన తీన్మార్ మల్లన్న…

పాలకుర్తి నియోజకవర్గంలో కాలువల అభివృద్ధి పేరుతో ఝాన్సీ రెడ్డి కోట్ల రూపాయలు దండుకుందని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు పాలకుర్తి స్థానిక కాంగ్రెస్ నేతలు. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, అత్త ఝాన్సీ రెడ్డి ఎంపీ నిధుల లెక్క చెప్పకుండా దోచుకున్నారని బాంబ్ పేల్చారు. పాలకుర్తిలో స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి మెజారిటీ వచ్చిందన్నారు. అందుకే ఝాన్సీ రెడ్డిని తొలగించి కాంగ్రెస్ పార్టీని బ్రతికించాలని అధిష్టానాన్ని కోరుతున్నామ‌ని తెలిపారు. Congress

Also Read: Jagan: చంద్ర‌బాబుకు వెన్నుపోటు..ఎన్టీఆర్ తో క‌లిసి జ‌గ‌న్ భారీ స్కెచ్ ?

Share your love