Lift Rescue: లిఫ్ట్ లోపల ఇరుక్కున్న కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్.. రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్!

Shashi Tharoor

తిరువనంతపురంలో ఓ ప్రైవేట్ హోటల్‌లో లిఫ్ట్ రెస్క్యూ ఆపరేషన్ జరిగింది. దీనికి కారణం కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ అక్కడ లిఫ్ట్‌లో చిక్కుకుపోవడమే. ఆయన్ని అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.

Lift Rescue థరూర్ సేఫ్

రోటరీ క్లబ్ ఈస్ట్ కార్యక్రమానికి వెళ్తూ శుక్రవారం సాయంత్రం థరూర్ ఈ హోటల్ లిఫ్ట్ ఎక్కారు. అది పైకి వెళ్తుండగానే ఆగిపోయింది. వెంటనే రెస్క్యూ టీమ్ వచ్చింది. ఇప్పటికే హోటల్ స్టాఫ్ ఇనుప రాడ్లతో డోర్ తెరవాలని ప్రయత్నించారు కానీ లాభం లేకపోయింది.

ఫైర్ సిబ్బంది హైడ్రా స్ప్రెడర్ మెషిన్ ఉపయోగించి లిఫ్ట్ డోర్స్ ఒడిసి లాగారు. అలా థరూర్‌తో సహా లోపల ఉన్న మొత్తం తొమ్మిది మందిని బయటకు తీసుకొచ్చారు. బయటకు వచ్చిన థరూర్ స్మైల్ తో ఫైర్ స్టాఫ్ కు థాంక్స్ చెప్పారు. మీరు గ్రేట్ గా పనిచేశారు, అందరికీ చాలా థాంక్స్ అని అన్నారు.

ఈ ఘటనపై థరూర్ ఎక్స్‌లో కూడా ఒక పోస్ట్ పెట్టారు. లిఫ్ట్ లో అరగంట పాటు ఉండటం పెద్ద ఇబ్బంది కాదు. కానీ ఆ తర్వాత నా రెండు మీటింగ్స్ కు లేట్ అయ్యాను అని ట్వీట్ చేశారు. లిఫ్ట్ రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్ అవడం వల్ల థరూర్ తన షెడ్యూల్ త్వరగా కంటిన్యూ చేయగలిగారు.

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu