మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ మళ్ళీ తన iconic show Kaun Banega Crorepati తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. KBC 18 సీజన్ ఆగస్టు 10 నుంచి ప్రారంభం కానుంది. ఈసారి prize money కూడా భారీగా రూ.7.5 కోట్లు ఉండనుంది. ఈ సీజన్ కోసం fans చాలా eager గా ఎదురుచూస్తున్నారు.
Amithabh Unplugged for KBC 18
ఈసారి KBC లో కొత్త twist ఉంది. పెరిగిన technology వల్ల Google, AI ల సాయంతో ఏదైనా సమాధానం క్షణాల్లో దొరుకుతోంది. కానీ ఈసారి అమితాబ్ బచ్చన్ స్వయంగా చెప్పినట్లు మీ phone లో ప్రతి question కి answer దొరుకొచ్చు, కానీ KBC 18 లో గెలవాలంటే thinking process మారాలి. అంటే సాధారణ knowledge సరిపోదు, ప్రతి ప్రశ్న వెనుక ఉన్న logic ని అర్థం చేసుకుని ఆలోచించాలి.
ఇప్పటికే ఈ సీజన్ కోసం audition process మొదలైంది. షో సోనీ ఎంటర్టైన్‌మెంట్ టెలివిజన్ లో ప్రతి సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9 గంటలకు ప్రసారం కానుంది. అలాగే Sony LIV OTT ప్లాట్‌ఫామ్ లో కూడా వీక్షించవచ్చు. సరికొత్త theme, కఠినమైన questions తో ఈ సీజన్ మరో సంచలనం సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
KBC అనేది కేవలం quiz show మాత్రమే కాదు, అది ఒక emotion. 2000 లో మొదలైన ఈ షో ఇప్పటికీ అంతే popularity ని కలిగి ఉంది. అమితాబ్ బచ్చన్ వయసు ఎనభై దాటినా, ఆయన energy మరియు hosting style ఇప్పటికీ fans ని attract చేస్తుంది. కొత్త ప్రశ్నలు మరియు భారీ prize money కారణంగా ఈ సీజన్ పైన భారీ ఆసక్తి ఉంది.





