YCP Firebrand జోగి రమేష్ కుటుంబంలో కోడలి ఆరోపణలు భారీ సంచలనం సృష్టించాయి. మాజీ మంత్రి జోగి రమేష్ కోడలు మేఘన తనపై మానసిక వేధింపులు, అదనపు కట్నం కోసం చిత్రహింసలు, ఏకంగా నాలుగు సార్లు హత్యాయత్నం జరిగిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు ఇబ్రహీంపట్నం పోలీసులు వారిపై గృహహింస కేసు నమోదు చేశారు. ఈ కేసులో జోగి రమేష్, ఆయన సతీమణి, కుమారుడు రాజీవ్ తో పాటు ఇతరులను చేర్చారు.
Jogi Ramesh Family Daughter-in-Law Allegations
గత ఏడాది 2025లో రాజీవ్-మేఘన వివాహం వైభవంగా జరిగింది. ఏడాది కాలంలోనే ఇంత పెద్ద వివాదం రావడం, హత్యాయత్నం వరకు ఆరోపణలు రావడం ఆశ్చర్యకరం. ప్రస్తుతం జోగి రమేష్ కుటుంబం పరారయ్యిందని వార్తలు వస్తున్నాయి. పోలీసులు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని విచారణ జరుపుతున్నారు. కుటుంబ వ్యవహారం కావడంతో పాటు హైప్రొఫైల్ రాజకీయ కుటుంబం కావడంతో పోలీసులు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఇప్పటివరకు వారు ఎలాంటి సమాచారం బయట పెట్టలేదు.
ఇక వైసీపీ పార్టీకి ఈ విషయం తలనొప్పిగా మారింది. పార్టీ తరఫున ఎవరూ ఈ అంశంపై స్పందించడం లేదు. ఇటీవల శ్రీకాకుళంలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కూడా తన కుమారుడి బైక్ ప్రమాదంలో సాక్ష్యాలు తప్పించబోయి జైలుకు వెళ్ళారు. అలాగే శవం డోర్ డెలివరీ కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు, ఆయన సతీమణి విచారణ ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు జోగి రమేష్ కుటుంబ వివాదం పార్టీకి మరో కొత్త సమస్యగా మారింది.
పోలీసులు జోగి రమేష్ కుటుంబానికి నోటీసులు జారీ చేశారు. కుటుంబం పరారీలో ఉండడంతో వారికి గేటు మీద నోటీసులు తగిలించారు. ఈ కేసు రాజకీయ వర్గాల్లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. కోడలి ఆరోపణలతో ఫైర్ బ్రాండ్ నేత జోగి రమేష్ కుటుంబం తీవ్ర ఇబ్బందుల్లో పడింది. ఇక ఈ కేసు ఎటువైపు మళ్ళుతుందో చూడాలి.





