SP Sailaja – Subhalekha Sudhakar: ఉదయాన్నే లేవగానే నిశ్చితార్థం అని చెప్పిన షాకింగ్ నిజం

S P Sailaja close-up

SP శైలజ, శుభలేఖ సుధాకర్ గారి పెళ్లి కథ విన్నారా? ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉందో తెలుసా. సింగర్ SP Sailaja తన నిశ్చితార్థం గురించి షాకింగ్ సీక్రెట్ చెప్పింది. ఉదయాన్నే లేవగానే నిశ్చితార్థం అని చెప్పిన షాకింగ్ నిజం బయటపెట్టింది. ఈమె లెజెండరీ సింగర్ SP బాలు చెల్లి అని తెలుసు. ప్రస్తుతం ఈ జంట ఇండస్ట్రీలో యాక్టివ్ గా ఉన్నారు. శైలజ జడ్జిగా కూడా పాపులర్ అయింది.

SP Sailaja Subhalekha Sudhakar Engagement Secret

SP శైలజ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు అమెరికా సంబంధాలు చాలా వచ్చేవి. నేను అమెరికా లేదా వేరే దేశానికి వెళ్ళను. అన్నయ్యకు దగ్గరగా చెన్నైలోనే ఉండాలి అని కండిషన్ పెట్టిందట. శుభలేఖ సుధాకర్ ను చూడ్డానికి అమ్మ, అన్నయ్య వెళ్లి చూసొచ్చారు. తర్వాత ఆమెకేమీ చెప్పకుండా ఒక రోజు ఉదయం నిద్రలేపి ఇవాళ నీ నిశ్చితార్థం అని అనడంతో షాకయ్యింది. కోపంగా ఫీల్ అయింది.

ఆ రోజు ఆమె కోపంగానే ఉన్నా నిశ్చితార్థం జరిగింది. ఆయన మంచోడే. అమ్మ, అన్న చూశారంటే వంక పెట్టడానికి ఉండదు. కానీ ముందే చెప్పాలి కదా అని చెప్పింది. ఆశ్చర్యకరంగా సుధాకర్ కు కూడా ఆ రోజు పొద్దున్నే ఇది తెలిసిందట! ఇద్దరికీ ఒకటే షాక్ అన్నమాట. ఇలా ఈ ఇద్దరికి పెళ్లి జరిగింది.

ఈ జంటకు శ్రీకర్ అనే బాబు ఉన్నాడు. అతను చెన్నైలో మీడియా రంగంలో వర్క్ చేస్తున్నాడు. శైలజ చెప్పిన ఈ ఫన్నీ స్టోరీ చూడ్డానికి థ్రిల్లింగ్ గా ఉంది. పెండింగ్ లో ఉన్న love story ఒక్క రోజులో ఎంగేజ్ మెంట్ తో ముగిసిన స్పెషల్ అనుభవం ఇది.

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu