
Prabhas: కావాలనే ప్రభాస్‌ను టార్గెట్ చేశారా!? ఒకే రోజు రెండు సినిమాల మెమోలు తయారు చేసినా, ప్రభాస్ సినిమా మెమోను చివరి వరకూ ఆపి విడుదల చేసినట్లు వార్తలు వస్తున్నాయి. చిరంజీవి సినిమాకి 8వ తేదీన తయారు చేసిన మెమో ఈరోజు 10 వరకు ఆపి విడుదల చేయడం జరిగింది. చిరంజీవి సినిమా మెమో విడుదల కాకపోవడం వల్ల అప్పటికే విడుదలైన ప్రభాస్ సినిమా జీవోపై మాత్రమే కోర్టులో స్టే విధించింది. Prabhas
Did you deliberately target Prabhas
సంక్రాంతి కోర్టు సెలవుల వల్ల చిరంజీవి సినిమా మెమో మీద స్టే లేనట్లే అని వార్తలు వస్తున్నాయి. చిరంజీవి మన శంకర వరప్రసాద్ సినిమాకు ఫేవర్ చేసేందుకు రాజాసాబ్ సినిమాను షాడో సినిమాటోగ్రఫీ మంత్రి రోహిణ్ రెడ్డి బలి చేసినట్లు వార్తలు వస్తున్నాయి. మన శంకర వరప్రసాద్ సినిమా టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతిస్తూ మొన్న(8వ తేదీ)నే మెమో తయారు చేసినా, బయటకు విడుదల చేయలేదట ప్రభుత్వం. Prabhas
Also Read: Congress: బయటపడుతున్న మంత్రుల బండారం…మంత్రివర్గంలో మార్పుల కోసమే ఇదంతా !
ప్రభాస్ రాజాసాబ్ సినిమాకు టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వకుండా, అర్ధరాత్రి జీవో విడుదల చేయడం ఇప్పుడు వివాదంగా మారింది. రాజసాబ్ సినిమా టికెట్ ధరల పెంపు మెమోను నిన్న హైకోర్టు కొట్టివేస్తుందని తెలిసే, చిరంజీవి సినిమా జీవోను గోప్యంగా ఉంచినట్లు సమాచారం అందుతోంది. ఈ రోజు నుండి 19వ తేదీ వరకు హైకోర్టుకు సెలవులని, జీవోను కొట్టివేసే అవకాశం లేదని తెలిసే, 8వ తేదీన తయారు చేసిన మెమో ఈ రోజు విడుదల చేశారని సినీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. సినీ పరిశ్రమలో వివాదాలకు దూరంగా ఉండే ప్రభాస్ మీద ఎందుకు ఇంత వివక్ష అంటూ ప్రభాస్ అభిమానులు ఆగ్రహానికి గురవుతున్నారు. Prabhas
Also Read: Telangana: పీరియడ్స్ వచ్చాయా.. నాటకాలు ఆడుతున్నావా ఏది చూపించు?





