Telangana Global Summit 2025: రేవంత్ కు ఎదురుదెబ్బ‌..కేసీఆర్ పాల‌న‌ను పొగిడిన యూకే మాజీ ప్రధాని ?

Telangana Global Summit 2025
Telangana Global Summit 2025

Telangana Global Summit 2025: తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం గ్లోబల్ సమ్మిట్ హడావిడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలన్న ముఖ్య లక్ష్యంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తోంది. ఇక ఈవెంట్ కు విదేశీ పెట్టుబడిదారులు, కార్పొరేట్ సంస్థల యాజమానులు, రాజకీయ నాయకులు, క్రీడాకారులతో పాటు సినీ సెలబ్రిటీలు వచ్చారు. అంతేకాదు యూకే మాజీ ప్రధాని టోనీ ప్లేయర్ కూడా ఈ ఈవెంట్ ను ఉద్దేశించి ప్రసంగించారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి కి షాక్ ఇస్తూ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పాలనను టోనీ బ్లెయిర్ మెచ్చుకున్నట్లు సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. కెసిఆర్ హయాంలో జరిగిన అభివృద్ధిని రేవంత్ రెడ్డి ముందే యూకే మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ మెచ్చుకున్నట్లు గులాబీ పార్టీ సోషల్ మీడియా కూడా ఆ వీడియోలను వైరల్ చేస్తోంది. Telangana Global Summit 2025

Tony Blair subba rao comments on Telangana Global Summit 2025

2014 సంవత్సరంలో ఏర్పడిన తెలంగాణ అంచలంచలుగా ఎదుగుతుందని వివరించారు. తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత కేవలం 10 సంవత్సరాల కాలంలోనే జి.ఎస్.డి.పి మూడింతలు పెరిగిందని ఆయన గుర్తు చేశారు. Per capita in come కూడా దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని.. ఇది చాలా రికార్డ్ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఒకానొక సమయంలో ఎంతో వెనుకబడి ఉన్న తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు టెక్నాలజీ అగ్రికల్చర్ లాంటి అన్ని రంగాల్లో ఉన్నత స్థాయిలో దూసుకు వెళ్తుందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో సమ్మిళిత అభివృద్ధి జరిగిందని.. ప్రపంచానికి ఒక మోడల్ గా ఎదిగిందని గుర్తు చేశారు. Telangana Global Summit 2025

Also Read: Donald Trump: ట్యాక్స్‌లు వేసి, టారిఫ్‌లు పెంచినందుకు రోడ్డుకు ట్రంప్ పేరు పెడుతున్నారా?

యూకే మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ తో పాటు ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు కూడా తెలంగాణ మోడ‌ల్ ను మెచ్చుకున్నారు. తెలంగాణ ఏర్పడిన తరువాత 10 ఏళ్ల తరువాత అందరూ తెలంగాణ మోడల్ ఫాలో అవ్వాలి అంటారన్నారు. గుజరాత్ మోడల్ అంటూ పాకులాడుతున్న రేవంత్ రెడ్డికి చురకలు అంటించార‌ని ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు వీడియోను వైర‌ల్ చేస్తోంది బీఆర్ ఎస్ పార్టీ సోష‌ల్ మీడియా. టోనీ బ్లెయిర్ తో పాటు సుబ్బారావు చేసిన కామెంట్ల‌ను బాగా వాడుకుంటుటోంది గులాబీ పార్టీ సోష‌ల్ మీడియా. రేవంత్ రెడ్డి స‌మ్మిట్ నిర్వ‌హిస్తే, కేసీఆర్ ను టోనీ బ్లెయిర్ లాంటి వ్యక్తులు మెచ్చుకున్నార‌ని సెటైర్లు పేల్చుతున్నారు. Telangana Global Summit 2025

Also Read: CM Revanth Reddy: పగిలిన టైర్.. సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్‌కు తప్పిన ప్రమాదం…

Share your love