
Akhanda 2: నందమూరి బాలయ్య నటించిన లేటెస్ట్ మూవీ అఖండ 2. ఈ సినిమా వాస్తవంగా డిసెంబర్ 5వ తేదీన రిలీజ్ కావాల్సి ఉంది. అయితే మరికొన్ని గంటల్లో రిలీజ్ కావాల్సిన ముందు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. మద్రాస్ లో Eros సంస్థ వేసిన కేసు కారణంగా అఖండ 2 సినిమాను వాయిదా వేయాల్సి వచ్చింది. 14 రీల్స్ ప్లేస్ సంస్థ ఇవ్వాల్సిన పాత బకాయిల నేపథ్యంలో ఏరోస్ సంస్థ కేసు వేసిందట. Akhanda 2
Akhanda 2 Postponed Jagan VS Balakrishna
అయితే ఈ కేసు కారణంగా కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. దీంతో సినిమాను వాయిదా వేశారు. అయితే ఈ బకాయిలను తాజాగా అఖండ 2 చిత్ర బృందం చెల్లించడంతో రిలీజ్ క్లియర్ అయింది. దీంతో నవంబర్ 12 అంటే రేపు రిలీజ్ కానుంది ఈ సినిమా. అయితే ఈ అఖండ 2 సినిమా ముందుగా ఆగిపోవడం వెనుక వైసిపి చక్రం తిప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డిని సైకో అంటూ బాలయ్య వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అటు మెగాస్టార్ చిరంజీవి కూడా అవమానించారు. Akhanda 2
Also Read: DK Shivakumar: గ్లోబల్ సమ్మిట్ 2025…తెలంగాణను అవమానించిన డీకే శివకుమార్ ?
వీటన్నిటిని మనసులో పెట్టుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమిళనాడు నుంచి చక్రం తిప్పినట్లు చెబుతున్నారు. Eros సంస్థ ద్వారా కేసు వేయించారట. అలాగే ఇటు మెగాస్టార్ చిరంజీవి సీరియస్ అయ్యేలాగా టాపిక్ ను డైవర్ట్ చేసిందట వైసీపీ పార్టీ. ముఖ్యంగా స్టాలిన్ ప్రభుత్వం తో వైయస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడి మరి కేసు వహించారట. దీంతో చివరి క్షణంలో అఖండ 2 వాయిదా పడినట్లు చెబుతున్నారు. ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలియదు కానీ, ఈ న్యూస్ వైరల్ గా మారింది. Akhanda 2
Also Read: KCR: కల్వకుంట్ల కవితపై కుక్క అంటూ కామెంట్స్..కేసీఆర్ భార్య ఆగ్రహం ?





