
Dk Shivakumar: కర్ణాటక కాంగ్రెస్ పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. అతి త్వరలోనే కాంగ్రెస్ పార్టీకి డీకే శివకుమార్ లాంటి ట్రబుల్ షూటర్ రాజీనామా చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. తాను చేసిన సంచలన వ్యాఖ్యల తరుణంలో కాంగ్రెస్ పార్టీకి డీకే శివకుమార్ గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. Dk Shivakumar
Deputy CM DK Shivakumar bids farewell to Congress
బెంగళూరులో నిన్న జరిగిన ఈవెంట్ సందర్భంగా డిప్యూటీ సీఎం పోస్టులో శాశ్వతంగా ఉండలేనని ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ స్పష్టం చేశారు. ఎక్కడ కృషి ఉంటుందో అక్కడే ఫలితం ఉంటుందని పెట్టిన పోస్టు.. ఇప్పుడు దుమారం రేపుతోంది.. ఈ పోస్ట్ ప్రకారం కాంగ్రెస్ పార్టీకి డీకే శివకుమార్ రాజీనామా చేయబోతున్నట్లేనని కొంతమంది చెబుతున్నారు. అందుకే అలాంటి పోస్ట్ పెట్టి ఉంటాడని అంటున్నారు. Dk Shivakumar
Also Read: Annapurna Ramanaidu Studios: అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోలకు బల్దియా GHMC
నాయకత్వ మార్పుపై నేరుగా వ్యాఖ్యానించకపోయినప్పటికీ డీకే శివకుమార్ పెట్టిన పోస్టుతో కర్ణాటక రాజకీయాలు ఒకసారిగా వేడెక్కాయి. అయితే కర్ణాటక పిసిసి అధ్యక్షులుగా ఉన్న డీకే శివకుమార్.. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం చాలా కష్టపడ్డారు. కానీ చివరికి సిద్ధరామయ్యకు ముఖ్యమంత్రి పదవి దక్కింది. రెండున్నర సంవత్సరాల తర్వాత డీకే శివకుమార్ కు సీఎం పదవి వస్తుందని కాంగ్రెస్ అధిష్టానం వెల్లడించింది. అయినప్పటికీ సిద్ధరామయ్య డీకే శివకుమార్ అన్నట్లుగానే రాజకీయాలు కొనసాగుతున్నాయి. Dk Shivakumar
Also Read: Shubman Gill: రెండో టెస్టుకు గిల్ దూరం.. ముంబైకి తరలింపు..మళ్లీ ఏం జరిగిందంటే ?





