Heroine Anjali interesting comments

Heroine Anjali: హీరోయిన్ అంజలి .. ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తన అంద చందాలతో ప్రతి ఒక్కరిని అలరించే ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతుంది. ప్రస్తుతం గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఇటీవల థియేటర్లలో ఈ మూవీ విడుదలైంది. ఈ నేపథ్యంలో అంజలి.. ఆలీతో సరదాగా సీజన్ 2 లో పాల్గొంది.

Heroine Anjali interesting comments

ఈ క్రమంలోనే అంజలి మాట్లాడుతూ.. ” గతంలో వచ్చిన గీతాంజలి ని నేను ఎంతగా ఎంజాయ్ చేస్తూ చేశాను.. ఈ సినిమాను కూడా అంతే ఎంజాయ్ చేస్తూ చేశాను. నాకు బాగా నచ్చిన కథ ఇది. ఈ కథను నాకు కోన గారు నిశ్శబ్దం సినిమా సమయంలో వినిపించారు. అది వర్కౌట్ కావడానికి ఎంత సమయం పట్టింది.

Also Read: Nikhil Devadula: ఆ మూవీ కోసం ఏకంగా వారం రోజులు కష్టపడ్డా.. కానీ ఆఖరిలో మహేష్ బాబు కొడుకు వచ్చి మొత్తం చెడగొట్టాడు.. బాహుబలి చైల్డ్ ఆర్టిస్ట్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

నేను నా కెరీర్ను మొదలుపెట్టి 18 ఏళ్లు అవుతుంది. ఇక గీతాంజలి నేను చేసిన ఫస్ట్ లేడీ ఓరియంటెడ్ సినిమా. నాకు మంచి గుర్తింపును తెచ్చి పెట్టిన మూవీ. ఈ సినిమా చేసిన పదేళ్లకు సీక్వెల్ చేశాను. ఈ పదేళ్లలో నేను చాలా నేర్చుకున్నాను. ఇక‌ పెళ్లికి సంబంధించిన రూమర్స్ తరచూ షికారు చేస్తూనే ఉంటున్నాయి.

Heroine Anjali interesting comments

ఇటీవల నాకు ఐదారు పెళ్లిళ్లు చేశారు. ఒకసారి బిజినెస్ మాన్ అంటారు మరొకసారి ఓ సీనియర్ నిర్మాత అంటారు. ఇలా ఏడాదికి ఒకరితో నాకు పెళ్లి చేస్తున్నారు. నా ప్రతి సినిమా విడుదలకి ముందు ఇలాంటి ప్రచారం మొదలవడం నేను గమనించిన విషయం ” అంటూ చెప్పుకొచ్చింది అంజలి. ప్రస్తుతం ఈమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారాయి.(Heroine Anjali)

Join WhatsApp