Ileana's shocking comments

Ileana: ప్రస్తుత కాలంలో హీరోయిన్లు ఇండస్ట్రీకి దూరమైనప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. ఈ కోవా కి చెందినదే ఇలియానా కూడా. కొడుకు మరియు భర్తతో హ్యాపీగా ఉన్న సమయంలో ఇలియానా చేసిన ఎమోషనల్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తెలుగు ప్రేక్షకులకి ఇలియానా పేరు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. దేవదాసు చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ అనంతరం పోకిరితో యువత కలల రాణిగా మారిపోయింది. పోకిరి అనంతరం ఇలియానా టాలీవుడ్ లో సునామీ సృష్టించిందని చెప్పుకోవచ్చు. స్టార్ హీరోలతో కలిసి ఆడి పాడింది. అయితే కెరీర్ బాగానే సాగుతున్న టైం లో బాలీవుడ్ లో కి వెళ్లి రాణించాలని భావించడం ఇలియానా చేసిన మొట్టమొదటి తప్పు అని చెప్పుకోవచ్చు.

Ileana’s shocking comments

ఫలితంగా ఇలియానా కెరీర్ డౌన్ అయిపోయింది. ఆమె కంటే ముందు వచ్చిన త్రిష మరియు శ్రేయ లాంటి హీరోయిన్లు ఇప్పటికీ కూడా తెలుగు ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. కానీ ఇలియానా టాలీవుడ్ ని వదిలేసి వెళ్లడంతో ఆమెని బాలీవుడ్ లో ఎవ్వరు పట్టించుకోలేదు. ఇలియానా లవ్ ఎఫైర్స్ సంచాలనం సృష్టించాయి. బ్రేకప్ ల వల్ల ఆమె మానసికంగా కృంగిపోయిన సంగతి తెలిసిందే. గతంలో ఇలియానా ఓ ఆస్ట్రేలియన్ ఫోటో గ్రాఫర్ ని ప్రేమించింది. వీళ్ళిద్దరి ప్రేమ బ్రేకప్ కావడంతో ఇలియానా డిప్రెషన్ లోకి వెళ్లి పోయింది. డిప్రెషన్ నుంచి తిరిగి పాల్గొన్న ఇలియానా మరో వ్యక్తిని ప్రేమించి ఓ బిడ్డకి తల్లి అయ్యింది కూడా.

Also Read: Heroine Anjali: నాకు ఏడాదికి ఒకసారి పెళ్లి అవుతుంది.. అంజలి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

ప్రస్తుతం కొడుకు మరియు భర్తతో హ్యాపీగా ఉన్న సమయంలో ఇలియానా చేసిన ఎమోషనల్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ముద్దుగుమ్మ అప్పుడప్పుడు ఆఫర్స్ అందుకుంటూ సినిమాల్లో నటిస్తుంది. ఇక ఈమె నటించిన లేటెస్ట్ మూవీ దో ఔర్ దో ప్కార్ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ చిత్రం ప్రచార కార్యక్రమాలలో భాగంగా ఇలియానా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ప్రస్తుతం ఆ ఇంటర్వ్యూలో ఏమైనా చేసిన వ్యాఖ్యలే సోషల్ మీడియాలో నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ” ఈ మూవీ దర్శకుడు శీరీష్ కథ చెప్పిన వెంటనే ఒప్పేసుకున్న. ఎందుకంటే ఈ పాత్ర నా కెరీర్ లైఫ్ కి దగ్గరగా ఉంది.

Ileana's shocking comments

కాస్తన పాత్రలో నెగిటివ్ కోణం ఉండటంతో నేను ఇంత తొందరగా ఒప్పుకుంటానని దర్శకుడు అనుకోలేదు. ఈ పాత్ర కోసం శారీరకంగా జిమ్ వర్కౌట్స్ లాంటివి చేయాలని దర్శకులు అడుగుతుందేమో అని భయపడ్డా. ఎందుకంటే నేను ఇప్పుడు మానసికంగా అలసిపోయి ఉన్నాను. కాబట్టి వర్కౌట్ చేసి నా బాడీని మార్చుకునే ఓపిక నాకు లేదు. బరువు తగ్గడం నా వల్ల కాదు అని డైరెక్టర్ కి చెప్పేసా. ఆమె స్టుపిడ్ లాగా మాట్లాడకు.. ఇప్పుడు నిన్ను బరువు తగ్గమని ఎవరు చెప్పారు. నువ్వు ఎలా ఉన్నావో అలాగే కంటిన్యూ అవ్వు అని నాకు ధైర్యం చెప్పాడు ” అంటూ చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఇక భర్త మరియు కొడుకుతో హ్యాపీగా ఉన్న ఇలియానా ఎందుకు మానసికంగా అలసిపోయాను అని చెప్పుకొచ్చిందా అని ప్రతి ఒక్కరూ ఆలోచించడం మొదలుపెట్టారు.(Ileana)

Join WhatsApp