who ignited the hype with Allu Arjun Pushpa Pushpa Pushpa

Allu Arjun: మొన్న విడుదలైన పుష్ప 2 ప్రోమో టైటిల్ సాంగ్ మీద సోషల్ మీడియాలో గట్టిగానే ట్రోలింగ్ జరుగుతుంది. భారీగా ఎక్స్పెక్ట్ చేస్తే ఏదో చిన్న సినిమాకి మ్యూజిక్ ఇచ్చినట్లు సాంగ్ ప్రోమో ని రిలీజ్ చేసేసరికి ప్రతి ఒక్కరూ నిరాశకు గురయ్యారు. నిజానికి ఈ వీడియోలో ఉన్నది కేవలం 20 సెకండ్లు. అది కూడా వరుసగా పుష్ప పుష్ప అంటూ కోరస్ లో సింగర్స్ పాడడం తప్ప ఇంకేం లేదు. సాధారణంగా దేవి శ్రీ ప్రసాద్ ట్యూన్స్ స్లో పాయిజన్ లా ఉంటాయి.

who ignited the hype with Allu Arjun Pushpa Pushpa Pushpa

గత ఏడాది వాల్తేరు వేరయ్య టైంలో వేరీజ్ ది పార్టీ మీద ఎంత కన్నా దారుణమైన ట్రోల్స్ జరిగాయి. కానీ కట్ చేస్తే రిలీజ్ అయ్యే లోపు ఆల్బమ్ మొత్తానికే కాదు సినిమా హైలెట్స్ లోనూ ఒకటిగా నిలిచింది. ఇక ఇప్పుడు పుష్ప 2 కి అదే రిపీట్ అవుతుందని దేవి శ్రీ అభిమానులు అంచనా వేస్తున్నారు. ఇది నిజమయ్యే అవకాశాలే ఎక్కువ. ఊ అంటావా సాంగ్ రిలీజ్ అయిన టైం లోను ట్విట్టర్ వేదికగా పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే దేవి శ్రీ ప్రసాద్ కు ఇదంతా అలవాటైనే చెప్పుకోవచ్చు.

Also Read: Ileana: మానసికంగా అలసిపోయా.. గాఢంగా ప్రేమించే వ్యక్తి కావాలి.. ఇలియానా షాకింగ్ కామెంట్స్..!

ఒకవేళ పూర్తి లిరికల్ సాంగ్ విన్నాక అప్పుడు ఎలాంటి అభిప్రాయాలైన వ్యక్తం చేయొచ్చు కానీ అసలు పాట మొదటి లైన్ కూడా బయటికి రాకుండానే ఇంతలా టార్గెట్ చేయడం ఏంటనేది అల్లు అర్జున్ ఫ్యాన్స్ ప్రశ్న. రకరకాల వీడియోలు మరియు మీన్స్ ని క్రియేట్ చేస్తూ టోటల్గా పుష్ప 2 పై ఉన్న అంచనాలను మంట కలిపేస్తున్నారు. మే 1 నా రాబోతున్న పుష్ప 2 టైటిల్ సాంగ్ వచ్చే అసలు స్పందన సినిమా బాజీ విషయంలో చాలా కీలకంగా వ్యవహరించనుంది. దేవిశ్రీ మీద మామూలు అంచనాలు లేవు.

who ignited the hype with Allu Arjun Pushpa Pushpa Pushpa

పుష్ప ని మించిన అవుట్ ఫుట్ ఇస్తాడని టాక్ యూనిట్ నుంచి వినిపిస్తున్న ప్రోటీన్ విషయం. పైగా ఈసారి నార్త్ ఆడియన్స్ కూడా విపరీతమైన ఎక్సైట్మెంట్ తో ఎదురుచూస్తున్నారు. వాళ్ల అంచనాలను నిలబెట్టుకోవడం కూడా కీలకం. మొత్తం ఐదు పాటలు ఉండొచ్చని సమాచారం. ఇక ప్రస్తుతానికి అయితే పుష్ప పుష్ప సాంగ్ సోషల్ మీడియాలో ఫుల్ ట్రోలింగ్ కి గురవుతుంది. ఈ సాంగ్ కి రవితేజ సినిమాలోని పుష్ప పుష్ప పుష్ప అనే ఫన్నీ డైలాగ్ ని ఆడ్ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.(Allu Arjun)

Join WhatsApp