I Lived on the Temple Steps - Rajendra Prasad

I Lived on the Temple Steps – Rajendra Prasad

Rajendra Prasad విలక్షణ నటుడు, సీనియర్ హీరో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad)గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎన్నో గెటప్లలో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించిన ఈయన మరొకవైపు లేడీ గెటప్లతో కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు. దాదాపుగా కొన్ని వందలకు పైగా చిత్రాలలో నటించి నేటికీ కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చలామణి అవుతూ అందరిని అలరిస్తున్న రాజేంద్రప్రసాద్ తెర వెనుక పడ్డ కష్టాలు మాత్రం అందరికీ కన్నీటిని తెప్పిస్తాయి.

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఉండే నటీనటులు తెరపైన ఎంత నవ్వును పండించినా సరే వారి నిజ జీవితంలో మాత్రం ఎన్నో కన్నీటి ఘట్టాలు ఉంటాయనడం లో సందేహం లేదు. అలాంటి వాటిని ఎదుర్కొన్న వారిలో రాజేంద్రప్రసాద్ కూడా ఒకరు. తాజాగా ఈటీవీలో ప్రసారమవుతున్న సుమ అడ్డ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాజేంద్రప్రసాద్ ఎన్నో విషయాలను పంచుకున్నారు. తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం కృష్ణారామ. డైరెక్టర్ రాజు మదిరాజు, రచ్చ రవి, సీనియర్ యాక్ట్రెస్ గౌతమి, రాజేంద్రప్రసాద్ నలుగురు కలిసి సుమా హోస్టుగా నిర్వహిస్తున్న సుమ అడ్డ కార్యక్రమానికి హాజరయ్యారు.

Also Read : Renu Desai : నిశ్చితార్థం జరిగి రెండో పెళ్లి చేసుకోకపోవడానికి కారణం అదే – రేణూ దేశాయ్..!

తాజాగా ఈ షో కి సంబంధించిన ప్రోమో ని విడుదల చేయగా చివర్లో కన్నీళ్లు పెట్టించేలా ప్రోమో సాగింది. ఈ క్రమంలోనే రాజేంద్రప్రసాద్ చెప్పిన విషయాలు హాట్ టాపిక్ గా మారాయి. తాను చిన్నప్పుడు పెరిగిన పరిస్థితులు ఎలాంటివో ఆయన బయటపెట్టారు. చిన్నప్పుడు దసరా పండుగను ఎలా సెలబ్రేట్ చేసుకునేవాల్లో తమ అనుభవాలను పంచుకోవాలని యాంకర్ సుమ అడగగా.. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. చిన్నప్పుడే మా అమ్మ చనిపోయింది.. ఇక నేను కూడా మూడు నెలల పాటు చనిపోయే స్థితికి చేరుకున్నాను. ఇక ఆ సమయంలో బంధువులు ఎవరూ కూడా నన్ను చేరతీయలేదు.

ఇక నేను చనిపోతానేమో అని నన్ను చూసుకోవడం ఇష్టం లేక కనకదుర్గమ్మ గుడికి తీసుకెళ్లి ఒరేయ్ ఇక ఇంటి దగ్గర మీ అమ్మ ఉండదు కదా.. ఇక్కడే మీ అమ్మ ఉంటుందని చెప్పి అక్కడే వదిలేసి వెళ్లారు. ఇక ఆ దుర్గమ్మనే తల్లిగా భావించి ఆ గుడిమెట్ల పైనే పెరిగాను అంటూ కన్నీటిని తెప్పించారు రాజేంద్రప్రసాద్. ఇకపోతే నటప్రస్థానంలో 300 పైగా సినిమాలలో నటించి స్టార్ పొజిషన్కు చేరుకున్న ఈయన బాల్యం మాత్రం అందరికీ కన్నీటిని తెప్పిస్తోంది.

Click Here to Follow PakkaFilmy in Google News

Join WhatsApp