Meenakshi Chaudhary gave stills to the photos while spending

Meenakshi Chaudhary: మీనాక్షి చౌదరి.. ఒకే ఒక్క సినిమాతో టాలీవుడ్ లో మంచి పేరు సంపాదించుకోవచ్చా అంటే దానికి ఈ ముద్దుగుమ్మ ఎగ్జాంపుల్ గా నిలబడుతుంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా ఇటీవల తెరకెక్కిన మూవీ గుంటూరు కారం. ఈ మూవీలో ఈ ముద్దుగుమ్మ సెకండ్ హీరోయిన్ గా నటించింది.

Meenakshi Chaudhary gave stills to the photos while spending

ఇక అంతకు ముందు పలు సినిమాల్లో నటించి పెద్ద ఎత్తున గుర్తింపును సంపాదించుకుంది. ఇక ఈమె ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించినప్పటికీ మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. సినిమా ఫ్లాప్ అయినా ఆ ఎఫెక్ట్ మాత్రం మీనాక్షి చౌదరి పై అస్సలు పడలేదని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ భామ తెలుగులో వరస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. ఇక మీనాక్షి చౌదరికి మరో బంపర్ ఆఫర్ వచ్చిందని తెలుస్తుంది.

Also Read: Allu Arjun: నా ప్రేమ మరియు మద్దతు పవన్ కళ్యాణ్‌కె.. అల్లు అర్జున్ ఇంట్రెస్టింగ్ పోస్ట్..!

ఈ బ్యూటీ కు లేటెస్ట్ గా చిరంజీవి సినిమాలో అవకాశం వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్తను మాత్రం సోషల్ మీడియాలో తెగ చక్కెరలు కొడుతున్నాయి. ప్రస్తుతం చిరంజీవి వశిష్ఠ మల్లిడి దర్శకత్వంలో విశ్వంభరా అనే సినిమా చేస్తున్న సమితి తెలుస్తుందే. ఈ సినిమా షూటింగ్ సర్వేగంగా జరుగుతుంది.

Meenakshi Chaudhary gave stills to the photos while spending

ఇక ఈ మూవీలో మీనాక్షి దేవకన్య లాగా కనిపించనున్నట్లు సమాచారం. ఇక ఇదిలా ఉంటే ఒక పక్క సినిమాలతో దూసుకుపోవడమే కాకుండా మరోపక్క సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటుంది ఈ భామ. తాజాగా ఎరుపు రంగు చీర ధరించి పాతకాలం రోజులను గుర్తు చేస్తూ ఆనాటి సావిత్రి లాగా కనిపించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతున్నాయి.(Meenakshi Chaudhary)

Join WhatsApp