Allu Arjun Interesting post

Allu Arjun: సినీ నటుడు మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి మనందరికీ సుపరిచితమే. ఈయన ఇటీవల పిఠాపురం లో ఎమ్మెల్యేగా పీఠం వేసిన సంగతి తెలిసిందే. మద్దతుగా ప్రజలు మరియు పలువురు సినీ సెలబ్రిటీలు కూడా రంగంలోకి దిగుతున్నారు. ఇక ఎన్నడూ లేను ఈ విధంగా చిరంజీవి సైతం ఓ వీడియోని షేర్ చేసి పవన్ కి అండగా నిలిచాడు. తాజాగా స్టార్ హీరో అల్లు అర్జున్ పవన్ కు మద్దతు తెలిపారు.

Allu Arjun Interesting post

ఆయన రాజకీయ ప్రయాణం అద్భుతంగా సాగాలని ఆకాంక్షిస్తూ ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ ని షేర్ చేశారు. ” పవన్ కళ్యాణ్ గారి ఎన్నికల ప్రయాణం విజయవంతంగా సాగాలని కోరుకుంటూ హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్న. మీరు ఎంచుకున్న మార్గం.. సేవ చేయాలన్న నిబంధన పట్ల నేను ఎంతో గర్విస్తున్న. ఒక కుటుంబ సభ్యుడిగా నా ప్రేమ మరియు మద్దతు ఎప్పటికీ మీకే ఉంటాయి.

Also Read: Jasmine flowers: మహిళలకు దిమ్మతిరిగే న్యూస్.. మల్లెపూలను పెట్టుకుంటున్నారా?.. అయితే డేంజర్ జోన్ లో పడినట్లే..!

మీ ఆకాంక్షలు, లక్ష్యాలు నెరవేరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ” అంటూ అటువీట్లో పేర్కొన్నాడు అల్లు అర్జున్. ఇటీవల జనసేన పార్టీకి మద్దతు తెలియజేస్తూ హీరో నాని వీడియోని షేర్ చేశాడు. ” పవన్ కళ్యాణ్.. మీరు పెద్ద రాజకీయ యుద్ధాన్ని ఎదుర్కొంటున్నారు. మీ సినిమా కుటుంబ సభ్యుడిగా మీరు కోరుకున్న విజయాన్ని సాధించాలని నేను ఆశిస్తున్న ” అని ఆ వీడియోలో చెప్పుకొచ్చారు నాని. ఇక తాజాగా చిరంజీవి వీడియోను తన యక్స్ వేదికగా పంచుకున్న రామ్ చరణ్..” భవిష్యత్ కోసం పాటుపడే నాయకుడు పవన్ కళ్యాణ్ను గెలిపించండి ” అంటూ రిక్వస్ట్ చేశారు.

Allu Arjun Interesting post

అలా మెగా హీరోలే కాకుండా జబర్దస్త్ కి చెందిన అనేకమంది హీరోలు పవన్ కి మద్దతుగా నిలిచారు. పిఠాపురంలో పవన్ గెలుపు పక్క అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ తన రాజకీయ ప్రయాణం మొదలుపెట్టి దాదాపు దశాబ్దా కాలం అవుతుంది. ఈ దశాబ్ద కాలంలో చిరంజీవి పవన్ కి ఇండైరెక్టుగా సపోర్ట్ చేయడమే కానీ డైరెక్ట్ గా అయితే ఎప్పుడు సపోర్ట్ చేయలేదు. కానీ 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కి మద్దతుగా నిలుస్తూ అఫీషియల్ గానే అనౌన్స్ చేశాడు చిరు. దీంతో పక్కా గా పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గలుస్తారు అంటూ ప్రతి ఒక్కరు నమ్ముతున్నారు.(Allu Arjun)

Join WhatsApp