Star Heroine who will soon give birth to a full-fledged child

Star Heroine: ప్రస్తుత కాలంలో చాలామంది సినీ సెలబ్రిటీలు దాంపత్య జీవితంలోకి అడుగుపెడుతూ.. అమ్మ అనే పిలుపుకి కూడా నోచుకుంటున్నారు. ఒకానొక సమయంలో సినీ సెలెబ్రిటీలు పెళ్లి మరియు పిల్లలు అంటేనే భయపడేవారు. కానీ ప్రస్తుత కాలంలో అలా ఉండకుండా తమకంటూ ఒక జీవితాన్ని సెట్ చేసుకుంటున్నారు. ఇక అలా టాలీవుడ్ హీరోయిన్ అమలాపాల్ కూడా తన జీవితంపై ధ్యాస పెట్టింది. ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులకి సుపరిచితమే.

Star Heroine who will soon give birth to a full-fledged child

నాయక్ మూవీ తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ స్టార్ హీరోల సరసన మెప్పించింది. ఇటీవల రిలీజైన పృధ్విరాజ్ సుకుమారన్ మూవీ ది గోట్ లైఫ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే గత ఏడాది ప్రియుడు జగత్ దేశాయ్ ను ఈమె పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక తరువాత అభిమానులకి గుడ్ న్యూస్ కూడా చెప్పింది. ప్రెగ్నెన్సీ తో ఉన్నట్లు ప్రకటించి తన ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ ఇచ్చింది. త్వరలోనే బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు ఈ ముద్దుగుమ్మ తాజాగా చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Also Read: Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేస్తూ చిరంజీవి స్పెషల్ వీడియో.. కళ్యాణ్ ని గెలిపించండి అంటూ రిక్వెస్ట్..!

ఈ సందర్భంగా తన భర్త పై ప్రశంసలు కురిపించింది. ప్రెగ్నెన్సీ ధరించిన సమయం నుంచి తనకు అన్ని విధాలుగా అండగా నిలిచారని చెప్పుకొచ్చింది. అమలాపాల్ తన ఇంస్టాగ్రామ్ లో ఓ ఫోటోను షేర్ చేస్తూ..” నాతోపాటు అర్ధరాత్రి వరకు ఉంటూ నా ఇబ్బందులను ఒక్కొక్కటిగా తగ్గిస్తూ.. నాపై మీకున్న అంచలంచలమైన నమ్మకం.. మీ ఉత్తేజపరిచే మాటలు నాలో శక్తిని నింపాయి. ఈ విలువైన గర్భధారణ ప్రయాణంలో ఉన్న వెన్నంటే ఉన్నందుకు ధన్యవాదాలు.

Star Heroine who will soon give birth to a full-fledged child

నా ఆత్మవిశ్వాసం సన్న గిల్లీన క్షణాల్లో కూడా నాకు మద్దతుగా నిలిచారు. మీలాంటి అపూర్వమైన వ్యక్తి నా జీవితంలోకి రావడం నిజంగా నేను ఏదో అద్భుతమైన చేసి ఉండాలి. నా శక్తి ప్రేమ తిరుగులేని మద్దతు ఉన్నందుకు ధన్యవాదాలు. నేను చెప్పే మాటలు అన్నింటికన్నా నేను నిన్ను ప్రేమిస్తున్నా ” అంటూ తను పోస్టులో రాసుకొచ్చింది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఎందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.(Star Heroine)

Join WhatsApp