Who is the star hero who saved Sukumar life and gave such a condition

Sukumar: డైరెక్టర్ సుకుమార్ అంటే ఇప్పుడు ప్రపంచం మెచ్చిన దర్శకుడు అని చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే పుష్ప సినిమాతో ఈయన తనలో ఉన్న దర్శకత్వ ప్రతిభను ఎంతోమంది సినీ ప్రియులకు కళ్ళకు కట్టినట్లు చూపించారు.ఈ సినిమాలో తన దర్శకత్వంతో ఎక్కడికో వెళ్లిపోయారు.అయితే అలాంటి సుకుమార్ ఓసారి నీళ్లలో పడి కొట్టుకుపోతుండగా ఆయన్ని కాపాడిన ఓ స్టార్ హీరో ఒక కండిషన్ పెట్టారట. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Who is the star hero who saved Sukumar life and gave such a condition

తాజాగా ఆర్య మూవీ విడుదలై 20 ఏళ్లు అయిన సందర్భంగా రీ యూనియన్ ని ఘనంగా జరిపించారు ఆర్య మూవీ నిర్మాత దిల్ రాజు.అయితే ఈ మూవీ ఈవెంట్ లో ఎన్నో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అయితే ఈ ఈవెంట్లో హీరో అల్లు అర్జున్ తన తో పాటు 7 సినిమాలు చేయాలి అని ఒక మాట తీసుకున్నట్లు సుకుమార్ ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్నీ బయట పెట్టారు. అయితే అప్పట్లో ఈ విషయం గురించి ఒక ప్రచారం జరిగింది. అదేంటంటే..ఆర్య సినిమా షూటింగ్ సమయంలో నది దగ్గర తెరకెక్కించే ఒక సన్నివేశం కోసం షూట్ చేస్తున్న సమయంలో డైరెక్టర్ సుకుమార్ ఉన్న బోట్ లో నీళ్లు రావడంతో అందులోని వాళ్ళందరూ ఈత కొట్టుకుంటూ బయటికి వచ్చేసారట.( Sukumar)

Also Read: Ranveer Singh: దీపిక పదుకొనే తో విడాకులు తీసుకోబోతున్న రణవీర్.. ప్రూఫ్ ఇదే..!

కానీ సుకుమార్ కి మాత్రం ఈత రాకపోవడంతో నదిలో మునిగిపోయారట.దాంతో అల్లు అర్జున్ నదిలోకి దూకి ప్రాణాలను సైతం లెక్కచేయకుండా డైరెక్టర్ సుకుమార్ ని కాపాడారట.ఇక నీళ్ల నుండి సుకుమార్ ని అల్లు అర్జున్ కాపాడి బయటకు తీసుకువచ్చాక సుకుమార్ స్పృహలోకి వచ్చి నేను నీ రుణం ఎలా తీర్చుకోగలను..నీ వల్లే నేను ఈరోజు బయట బయటపడ్డాను అంటూ పెద్ద పెద్ద డైలాగులు చెప్పారట. అయితే ఈ డైలాగులు అన్నీ విన్న అల్లు అర్జున్ మీరు నాకు పెద్దగా థాంక్స్ చెప్పనవసరం లేదు. అలాగే నా రుణం మీరేం ఉంచుకోవాల్సిన అవసరం లేదు.

Who is the star hero who saved Sukumar life and gave such a condition

ఆర్య సినిమా హిట్ అయితే మీరు నాతో 7 సినిమాలు చేయాలి అంటూ చెప్పారట.ఇక తన ప్రాణం కాపాడిఅల్లు అర్జున్ మీద ప్రేమతో అదే సమయంలో సుకుమార్ నువ్వు ఎలాంటి పొజిషన్ లో ఉన్నా నేను నీతో ఏడు సినిమాలు చేస్తాను అని మాట ఇచ్చారట సుకుమార్.అలా అప్పుడు ఇచ్చిన మాటకి ఇప్పటివరకు సుకుమార్ కట్టుబడి ఉన్నారు.. ఇక ఇప్పటికే వీరి కాంబినేషన్లో ఆర్య,ఆర్య 2, పుష్ప,త్వరలోనే పుష్ప-2 రాబోతోంది.ఇక ఇప్పటికే నాలుగు సినిమాలు అయిపోయాయి ఇక రాబోయే మూడు సినిమాలు ఏ లెవెల్ లో ఉంటాయో చూడాలి.( Sukumar)

Join WhatsApp