Did Vijayashanti want to marry the star hero

Vijayashanti: లేడీ అమితాబ్ గా తెలుగు చిత్ర సీమ పరిశ్రమలో పేరుగాంచిన నటి విజయశాంతి ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో చాలామంది హీరోలకు హీరొయిన్ గా చేసి ఆ తర్వాత లేడీ ఓరియంటెడ్ సినిమాలను చేయడం మొదలు పెట్టింది. ఒకానొక దశలో ఈ హీరోయిన్ స్టార్ హీరోలకు పోటీగా తన సినిమాలను రిలీజ్ చేస్తూ బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టింది.అంతేకాదు హీరోలకు సరి సమానంగా రెమ్యూనరేషన్ తీసుకోవడంలో విజయశాంతి ముందుండేది.అయితే విజయశాంతి ఎంవీ శ్రీనివాస్ ప్రసాద్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది.

Did Vijayashanti want to marry the star hero

పెళ్లయ్యాక కూడా సినిమాల్లో కొనసాగింది. అలాగే ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్న విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతోంది.అయితే చాలా సంవత్సరాలుగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ మొదటిసారి మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు మూవీలో కీలకపాత్రలో నటించింది. ఇదంతా పక్కన పెడితే నటి విజయశాంతి తన భర్త శ్రీనివాస్ ప్రసాద్ కి విడాకులు ఇచ్చి ఆ హీరోని రెండో పెళ్లి చేసుకోబోతుంది అంటూ అప్పట్లో ఒక రూమర్ చక్కర్లు కొట్టింది. (Vijayashanti)

Also Read: Star Heroine: త్వరలోనే పండంటి బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ బ్యూటీ.‌.. భర్తపై స్పెషల్ పోస్ట్..!

అయితే ఆ హీరో ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం.. బాలకృష్ణ విజయశాంతి కాంబినేషన్లో ఎన్నో సినిమాలు వచ్చాయి ఇక వీరిద్దరి జోడి బాగుండడంతో చాలామంది దర్శకులు వీరిద్దరిని పెట్టి ఎన్నో సినిమాలు తీసేవారు. అలా వీరి మధ్య మంచి కెమిస్ట్రీ ఉండడంతో ఇండస్ట్రీలో ఉన్న కొంత మంది జనాలు వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారని, విజయశాంతి తన భర్తకి విడాకులు ఇచ్చి బాలకృష్ణ రెండో పెళ్లి చేసుకుంటుంది అని ప్రచారం చేశారు.

Did Vijayashanti want to marry the star hero

అయితే ఇందులో ఎలాంటి నిజం లేదు అని సీనియర్ జర్నలిస్ట్ ఈమంది రామారావు ఆ ఇంటర్వ్యూలో బయటపెట్టారు.అయితే విజయశాంతి బాలకృష్ణ మధ్య ఆ రూమర్ వచ్చిన దాని కంటే ముందే విజయశాంతికి శ్రీనివాస్ ప్రసాద్ తో పెళ్లయిందని,అసలు బాలకృష్ణ విజయశాంతి కేవలం స్క్రీన్ వరకు మాత్రమే సన్నిహితంగా ఉండే వాళ్ళని,కానీ నిజ జీవితంలో వారిద్దరి మధ్య అలాంటి చెడు రిలేషన్ ఏమీ లేదు అంటూ క్లారిటీ ఇచ్చారు.(Vijayashanti)

Join WhatsApp