Allu Arjun: I will never make that mistake again in my life

Allu Arjun: అల్లు అర్జున్.. ఈ హీరో సినీ బ్యాగ్రౌండ్ ఉన్న అబ్బాయే అయినప్పటికీ మొదటి సినిమాతోనే ఎన్నో విమర్శల పాలయ్యారు. చాలామంది ఈయనకు సినిమాలు సెట్ అవ్వవు అని,ఫేస్ చూస్తేనే అచ్చం అమ్మాయిలా ఉందని ఎంతో అవమానంగా మాట్లాడారట.ఇక ఈయన మొదటి సినిమా గంగోత్రి షూటింగ్ సమయంలో ఎన్నో అవమానాల పాలయ్యారట.అయితే ఈ సినిమా హిట్ అయినప్పటికీ ఆ తర్వాత మళ్లీ సినిమా చేయడానికి కోసం దాదాపు కొన్ని వేల కథలు విన్నారట.

Allu Arjun: I will never make that mistake again in my life

కానీ ఆయనకు ఏ ఒక్కటి కూడా నచ్చలేదట. చివరికి సుకుమార్ చెప్పిన ఆర్య సినిమా కథ నచ్చి దానిలో హీరోగా చేసి రెండో సినిమాతోనే అల్లు అర్జున్ తనకంటూ ఇండస్ట్రీలో ఓ ప్రత్యేక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నారు. అయితే అలాంటి అల్లు అర్జున్ తాజాగా జరిగిన ఆర్య మూవీ రిలీజయ్యి 20 ఇయర్స్ అయినందున రీ యూనియన్ ఈవెంట్లో ఒక షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు. ఇంకెప్పుడు అలాంటి పని చేయద్దు..బుద్ధి వచ్చింది..(Allu Arjun)

Also Read:Ram Charan: నీ సినిమా రిలీజ్ ని వాయిదా వెయ్యంటూ ఆ డైరెక్టర్ ని భయపెట్టిన రామ్ చరణ్.. కానీ చివరికి..?

నా లైఫ్ లో ఇంకోసారి ఆ పని చేయను అంటూ చెప్పారు. అయితే అసలు విషయం ఏమిటంటే..ఆర్య సినిమా షూటింగ్ సమయంలో న్యూ ఇయర్ సందర్భంగా అల్లు అర్జున్ ఫుల్ గా ఎంజాయ్ చేసి రాత్రి పడుకోకుండా ఫ్రెండ్స్ తో ఫుల్ ఎంజాయ్ చేశారట.అయితే నాకు న్యూ ఇయర్ అంటే చాలా ఇష్టం. అయితే అదే రోజు తెల్లవారు జామున షూటింగ్ ఉందని ఫోన్ రావడంతో గబగబా లేచి ఫ్రెషప్ అయ్యి వెళ్లాను.

Allu Arjun: I will never make that mistake again in my life

ఇక రాత్రి నిద్ర లేకపోవడంతో షూటింగ్ సమయంలో ఎండ, నిద్రలేమితో ఇబ్బందిపడి “తకధిమితోం” అనే సాంగ్ షూటింగ్ సమయంలో ఎంతగానో ఇబ్బంది పడిపోయాను.ఇక ఆరోజే నిర్ణయించుకున్నానుఇంకెప్పుడు కూడా షూటింగ్ రేపు ఉంటుంది అనగా ఈరోజు పార్టీలు వంటి వాటికీ దూరంగా ఉండాలి త్వరగా పడుకోవాలి అని..నాకు ఆరోజు బుద్ధి వచ్చింది.. అందుకే ఇప్పటివరకు ఆ రూల్ ని ఒకటి రెండు సార్లు తప్ప ఎక్కువసార్లు బ్రేక్ చేయలేదు. అంటూ అల్లు అర్జున్ తాజాగా ఈ ఈవెంట్ లో ఆ విషయాన్ని చెప్పుకువచ్చారు.(Allu Arjun)

Join WhatsApp