

Naa Anveshana : ప్రపంచ వ్యాప్తంగా ట్రావెల్ వీడియోలతో మంచి గుర్తింపు సంపాదించిన తెలుగు యూట్యూబర్ నా అన్వేషణ ఇన్ స్టాగ్రామ్ ఖాతాను యాజమాన్యం తొలగించింది. దీంతో అతను సంచలన కామెంట్స్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ బ్యాన్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ బ్యాన్ అయినా నా ఈకతో సమానం అంటూ వీడియో విడుదల చేశాడు. తనకు నెలకు రూ.8 లక్షలు వస్తాయి.. ఇన్‌స్టాగ్రామ్ ఉంటే ఎంత పోతే ఎంత అంటూ అన్వేష్ సెన్షేషన్ కామెంట్స్ చేశాడు. Naa Anveshana
Also Read : ADI SRINIVAS PA : ప్రభుత్వ విప్ ఆదిశ్రీనివాస్ పీఏ భార్య చనిపోవడానికి కారణం అతనేనా..?
సుమారు 1.3 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్న ఈ అకౌంట్ ఒక్కసారిగా కనుమరుగు కావడంతో సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఈ చర్య వెనుక హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు రాసిన లేఖనే ప్రధాన కారణంగా తెలుస్తోంది. గతంలో అన్వేష్ తన వీడియోల్లో భారతదేశాన్ని ఉద్దేశించి చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర వివాదస్పదమయ్యాయి. దేశాన్ని దూషించాడనే ఆరోపణలతో నటి కరాటే కళ్యాణి హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. Naa Anveshana
ఇక దర్యాప్తులో భాగంగా తొలుత సీసీఎస్ పోలీసులు ఇన్ స్టాగ్రామ్ ఫౌండర్లకు లేఖ రాసి వివరాలను సేకరించారు. ఆ తరువాత తక్షణమే ఆ అకౌంట్ తొలగించాలని ఇన్ స్టాగ్రామ్ నిర్వాహకులకు మరో లేఖ రాశారు. నా అకౌంట్ పోతే ఏముంది. నాకు బుర్ర ఉంది. చేతులు పోతే కాళ్లు, కాళ్లు పోతే, మెడ ఇలా సెన్షేషన్ కామెంట్స్ తో ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Naa Anveshana







