Y.S.Jagan : టీవీలో చూస్తే మ్యాచ్ క‌న‌ప‌డదా..? కొలంబో వెళ్లాలా..?

Y.S.Jagan : ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రి నారా లోకేష్ ఇటీవ‌ల భార‌త్ వ‌ర్సెస్ పాకిస్తాన్ మ‌ధ్య జ‌రిగిన క్రికెట్ మ్యాచ్ ను కొలంబోకి వెళ్లి వీక్షించిన విష‌యం తెలిసిందే. అయితే ఆయ‌న మ్యాచ్ వీక్షించిన స‌మ‌యం నుంచి వైసీపీ నేత‌లు విమ‌ర్శ‌లు చేస్తున్నారు. అందుకు నారా లోకేష్ కూడా కౌంట‌ర్ ఇస్తున్నారు. తాజాగా ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్ స్పందించారు. టీవీలో మ్యాచ్ చూస్తే.. క‌న‌పించ‌దా.. కొలంబో వెళ్లి మ్యాచ్ చూడాలా..? అని ప్ర‌శ్నించారు. Y.S.Jagan

former-cm-ys-jagans-satirical-comments-on-minister-nara-lokesh

ఎంత క్రికెట్ అభిమానివి అయినా టీవీలో చూస్తే క‌నిపించ‌దా..? తాను కూడా టీవీలోనే చూశాన‌ని గుర్తు చేశారు. కొలంబోలో మ్యాచ్ ఆడుతుంటే.. ప్రైవేట్ ఫ్లైట్ లో కొలంబోకి వెళ్లి మ్యాచ్ చూస్తాడ‌ని సెటైర్లు వేశారు.ఇందుకు జ‌గ‌న్ కి సోష‌ల్ మీడియాలో కౌంట‌ర్లు కూడా ప‌డ్డాయి. Y.S.Jagan

Also Read : Naa Anveshana : ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ బ్యాన్ అయినా నా ఈక‌తో స‌మానం..!

మ‌రోవైపు నారా లోకేష్ మాత్రం తాను ప్ర‌భుత్వ డ‌బ్బులు ఖ‌ర్చు చేయ‌లేదు. నా సొంత డ‌బ్బుల‌తో నేను కొలంబో వెళ్లి మ్యాచ్ చూస్తే..వైసీపీ నాయ‌కులకు ఏంటి..? అని పేర్కొన్నారు.అయిన‌ప్ప‌టికీ వైసీపీ నేత‌లు మాత్రం నారా లోకేష్ పై కామెంట్స్ చేస్తుండ‌టం విశేషం.

Also Read : ADI SRINIVAS PA : ప్ర‌భుత్వ విప్ ఆదిశ్రీనివాస్ పీఏ భార్య చ‌నిపోవ‌డానికి కార‌ణం అత‌నేనా..?

Share your love