Fauji: రాజేష్ శర్మ విషపురుగు కాటు వార్తలపై స్పష్టత

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఫౌజీ సినిమా షూటింగ్ సమయంలో రాజేష్ శర్మకు విషపురుగు కాటేసిందని సోషల్ మీడియాలో వైరల్ అయిన వార్తలను అతని టీమ్ పూర్తిగా ఖండించింది. హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుగుతుండగా బాలీవుడ్ నటుడు రాజేష్ శర్మ కాలికి విషపురుగు కాటేసిందని, ఆ తర్వాత ఆయన్ను హాస్పిటల్ కి తరలించారని ప్రచారం జరిగింది. ఫౌజీ సినిమా షూటింగ్ సమయంలో ఎలాంటి యాక్సిడెంట్ జరగలేదని, ఈ వార్తల్లో నిజం లేదని రాజేష్ శర్మ పీఏ సుభాశిష్ పాండా ఒక వీడియో రిలీజ్ చేసి స్పస్టం చేశారు.

రాజేష్ శర్మ డయాబెటిస్ కారణంగా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు తప్ప వేరే కారణం లేదు. ఆయన ప్రస్తుతం పూర్తి కంఫర్ట్ గా ఉన్నాడు. ఫౌజీ సెట్స్ లో ప్రమాదం జరిగిందనే వార్తలు అవాస్తవం. గురువారం నాడు డాక్టర్లు అతడిని డిశ్చార్జ్ చేస్తారు. ఈ స్పస్టీకరణ తర్వాత సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫేక్ న్యూస్ కు పూర్తి ఫుల్ స్టాప్ పడింది. ఫౌజీ చిత్రం ఇప్పుడు చాలా బిజీగా ఉంది, అలాంటి సమయంలో ఇలాంటి వదంతులు రావడం బాధాకరం అని నిర్మాతలు చెప్పారు.

దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఫౌజీ మూవీ భారీ బడ్జెట్ తో రూపు దిద్దుకుంటుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో వస్తున్న ఈ సినిమా వార్ నేపథ్యంలో ఫిక్షనల్ హిస్టారికల్ లవ్ డ్రామా గా రానుంది. ప్రభాస్ కు జోడీగా ఇమాన్ ఎస్మాయిల్ నటిస్తుండగా, జయప్రద, మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, రాజేష్ శర్మ వంటి సీనియర్లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టైటిల్ పోస్టర్ కు అదిరిపోయే స్పందన వచ్చింది.

టెక్నికల్ టీంలో విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ ఇస్తుండగా, కమల్ కణ్ణన్ VFX సూపర్వైజర్ గా, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్ గా పని చేస్తున్నారు. టీ-సిరీస్ సమర్పణలో నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మాతలు. ఫ్యాన్స్ అందరూ తదుపరి అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నారు. రాజేష్ శర్మ విషపురుగు కాటు వార్తలు పూర్తిగా ఫేక్ అని అతను డయాబెటిస్ కారణంగా మాత్రమే అడ్మిట్ అయ్యాడు. ఫౌజీ సెట్స్ లో అన్నీ స్మూత్ గా జరుగుతున్నాయని నిర్మాణ యూనిట్ క్లారిటీ ఇచ్చింది.

Share your love