
Telangana Wines: కొత్త సంవత్సరం వస్తోంది. డిసెంబర్ 31 అంటేనే తాగుబోతులు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఆరోజున పాత సంవత్సరం వెళ్ళిపోతోందని బాధతో కొంతమంది తాగితే, కొత్త సంవత్సరం రాబోతుందని ఎంజాయ్ తో మరికొంతమంది చిల్ అవుతూ ఉంటారు. అయితే ఈ డిసెంబర్ 31, న్యూ ఇయర్ వేడుకలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం క్యాష్ చేసుకోవాలని ఈ ప్లాన్ చేసింది. ఇందులో భాగంగానే మందుబాబులకు అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. Telangana Wines
Telangana government allows Telangana Wines to operate till 12 midnight and bars till 1 am on December 31st
న్యూ ఇయర్ సందర్భంగా డిసెంబర్ 31వ తేదీన అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం దుకాణాలు ఓపెన్ చేసుకోవచ్చని ఆదేశాలు జారీ చేసింది. అలాగే రాత్రి ఒంటిగంట వరకు బార్లు తెరుచు కోవచ్చని పర్మిషన్స్ ఇచ్చింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. Telangana Wines
Also Read: Tolivelugu Raghu: వివాదంలో తొలి వెలుగు రఘు…ఎన్ఐఏ నోటీసులు
ప్రతి సంవత్సరం ఇలాగే ప్రభుత్వాలు పర్మిషన్లు ఇవ్వడం… అర్ధరాత్రి అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించడం జరుగుతోంది. ఈసారి కూడా అర్ధరాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తామని పోలీసులు చెబుతున్నారు. ఏదేమైనా అర్ధరాత్రి ఒంటిగంట వరకు పర్మిషన్లు ఇవ్వడం పట్ల మందుబాబులు సంతృప్తి వ్యక్తం చేస్తూ.. రేవంత్ అన్నకు జై కొడుతున్నారు. Telangana Wines
Also Read: KCR: ఏపీలో కేసీఆర్ పర్యటన..పార్థసారథి అదిరిపోయే కౌంటర్..?





