యంగ్ టైగర్ ఎన్టీఆర్ నెక్స్ట్ లెవెల్ మూవీగా ‘గాడ్ ఆఫ్ వార్’ ఫుల్ హైప్ క్రియేట్ చేస్తోంది. త్రివిక్రమ్ సార్ డైరెక్షన్లో ఇదో మాసివ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ అవుతుందని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. రీసెంట్గా విడుదలైన సిక్ కాన్సెప్ట్ పోస్టర్ ఈ సినిమా మీద buzz ని డబుల్ చేసింది. ఇప్పుడు లేటెస్ట్ టాక్ ఏంటంటే, ఈ సినిమాలో లీడింగ్ లేడీ కోసం బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ పేరు స్ట్రాంగ్గా వినిపిస్తోంది. థియేట్రికల్ ఫీల్ ఉన్న ఈ మైథలాజికల్ యాక్షన్ డ్రామాలో ఆమె కోసమే మేకర్స్ డెడ్ సీరియస్గా ఉన్నారని టాలీవుడ్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
##### God of War heroine NTR Kiara
అయితే ఆఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రం ఇంకా పెండింగ్లో ఉంది. సోషల్ మీడియాలో ఈ కాంబినేషన్ గురించి డిస్కషన్స్ భారీగా జరుగుతున్నాయి. ఈ చిత్రంలో తారక్ పవర్ఫుల్ యోధుడిగా కనిపించబోతున్నట్లు టాక్. స్టోరీలో ఓ మెయిన్ ఫీమేల్ క్యారెక్టర్ ఉందనీ, దానికి కియారా కరెక్ట్ ఛాయిస్ అనేది టీమ్ ఓపీనియన్. ఇప్పటికే ఎన్టీఆర్, కియారా ‘వార్ 2’ లో కలిసి యాక్ట్ చేసినా, రొమాంటిక్ యాంగిల్ ఏమీ లేదు. కానీ ‘గాడ్ ఆఫ్ వార్’లో ఒకవేళ ఆమె ఫైనల్ అయితే, ఫుల్ లెంగ్త్ లవ్ స్టోరీ చూసే అదృష్టం ఫ్యాన్స్కి దక్కుతుంది.
ఇక తెలుగు మార్కెట్ లో కియారా ట్రాక్ రికార్డ్ మిక్స్డ్గా ఉంది. ఆమె నటించిన ‘భరత్ అనే నేను’ సూపర్ హిట్ కాగా, రామ్చరణ్ సరసన చేసిన ‘వినయ విధేయ రామ’, ‘గేమ్ ఛేంజర్’ మాత్రం బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. దీంతో కొంతమంది నెటిజన్లు సెంటిమెంట్ అనే కాన్సెప్ట్ తెచ్చి ట్రోల్ చేస్తున్నారు. అయితే ఇవి పూర్తిగా మూడ్ స్వింగ్ టాక్ అని, ఒక సినిమా రిజల్ట్ కి వేరే సినిమాకి లింక్ లేదని బుర్ర ఉన్నవాళ్లు కామెంట్ చేస్తున్నారు. ఫైనల్గా కియారా పెర్ఫార్మెన్సే కీ అని మెజారిటీ ఫీలింగ్.
ముంబై బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన కియారా ‘ఫగ్లీ’తో స్టార్ట్ చేసి ‘కబీర్ సింగ్’, ‘షేర్షా’ లాంటి బ్లాక్బస్టర్లతో టాప్ పొజిషన్కి వచ్చింది. సిద్ధార్థ్ మల్హోత్రాతో పెళ్లి తర్వాత కూడా వరుస హిట్లతో బిజీగా ఉంది. ఇక ఇవేళ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్తో ‘డ్రాగన్’ షూటింగ్లో బిజీగా వున్నాడు. ఈ హై-ఆక్టేన్ ప్రాజెక్ట్ పూర్తైన వెంటనే త్రివిక్రమ్తో ‘గాడ్ ఆఫ్ వార్’ సెట్స్ మీదకు రావడం పక్కా అని ఇండస్ట్రీ ఇన్సైడర్స్ ఖచ్చితంగా చెప్తున్నారు.





