NTR: ఓజి హిట్టుతో ఎన్టీఆర్ ని కెలికిన టీడీపీ ఎమ్మెల్యే.. తాత పేరు చెప్పుకొని టికెట్లు అమ్ముకున్నావంటూ.!

MLA Insult NTR

NTR: ఓజి హిట్టుతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లోనే కాకుండా ఇతర టిడిపి శ్రేణులు, జనసేన కార్యకర్తలు,బిజెపి కార్యకర్తలు ఇలా ప్రతి ఒక్కరు సినిమా గురించి తమదైన శైలిలో స్పందిస్తూ పాజిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఓజి హిట్ తో మరోసారి వార్-2 మూవీ సమయంలో ఏర్పడిన విభేదాలు బయటికి వచ్చేసాయి. అదేంటంటే వార్-2 మూవీ విడుదలైన సమయంలో టిడిపి ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఎన్టీఆర్ ని వార్ -2 మూవీని ఉద్దేశించి మాట్లాడమే కాకుండా ఎన్టీఆర్ తల్లిని ఉద్దేశించి బూతులు కూడా మాట్లాడారు.

MLA Insult NTR

ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున ఎన్టీఆర్ ఫ్యాన్స్ నిరసనలు తెలపడంతో దగ్గుబాటి ప్రసాద్ నేను ఆ మాటలు మాట్లాడలేదని, అదంతా ఎవరో నా మీద ఫేక్ ఆడియో క్రియేట్ చేశారని క్లారిటీ ఇచ్చారు. కానీ నాలుగు గోడల మధ్య కాదు నలుగురిలోకి వచ్చి క్షమాపణ చెప్పాలని ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిమాండ్ చేసినప్పటికీ దగ్గుబాటి ప్రసాద్ బయటికి వచ్చి క్షమాపణలు కోరలేదు.అలా ఆ వివాదం అలాగే కొనసాగుతోంది. (NTR)

Also Read: Pawan Kalyan: హీరోయిన్లకి అదృష్టంగా మారిన పవన్ కళ్యాణ్.. అప్పుడు ఆ హీరోయిన్ కి ఇప్పుడు ఈ హీరోయిన్…

అయితే తాజాగా వచ్చిన ఓజి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో దగ్గుబాటి వెంకటప్రసాద్ పేరిట ఓ షాకింగ్ ట్వీట్ వైరల్ అవుతుంది. అందులో సార్ పవన్ కళ్యాణ్ గారిది అదేమో క్రేజ్ సార్.. దగ్గర ఉండి చూసుకుందాం అనుకున్నా.. అప్పటికే 1000 మంది ఫోన్ చేసారు టికెట్ల కోసం. అది క్రేజ్ సార్..కానీ కొంతమంది ఉంటారు తాత పేరు చెప్పుకొని మా టీడీపీ పార్టీ అని చెప్పి టికెట్లు అమ్ముకుంటారు అంటూ ఎక్స్ ఖాతాలో ట్వీట్ పెట్టారు.

MLA Insult NTR

అయితే ప్రస్తుతం ఈ ట్వీట్ ఎన్టీఆర్ అభిమానులని హర్ట్ చేసింది. పవన్ కళ్యాణ్ ని ప్రశంసిస్తూ ఎన్టీఆర్ ని అవమానించేలా ఈ ట్వీట్ ఉండడంతో మరోసారి ఎన్టీఆర్ ఫ్యాన్స్ దగ్గుబాటి ప్రసాద్ పై మండిపడుతున్నారు. అయితే ఇది దగ్గుబాటి ప్రసాద్ సొంతంగా పెట్టింది కాదు అని ఓ ఫేక్ అకౌంట్ ఆయన పేరు మీద క్రియేట్ చేసి ఆయనే పెట్టినట్టు ఎవరో ట్వీట్ పెట్టారని తెలుస్తోంది.ఇక ఈ ఫేక్ అకౌంట్ ల పై సైబర్ క్రైమ్ పోలీసులకు దగ్గుబాటి ప్రసాద్ ఫిర్యాదు చేసినట్టు సమాచారం.(NTR)

https://twitter.com/Prasadoficial/status/1970906234548371751
Share your love