త్రివణ గురుపీఠం ప్రారంభించిన ప్రొడ్యూసర్స్ హరిత గోగినేని, ఏఆర్ అభి

అన్ని పూజలు చేసుకోలేని వారికి సహకారం ఇవ్వాలనే పూర్తి నిస్సార్థంగా త్రివణ గురుపీఠం ఏర్పాటు చేశాం అన్నారు నిర్మాత హరిత గోగినేని. ప్రొడ్యూసర్ ఏఆర్ అభితో కలిసి హైదరాబాద్ చిత్రపురి కాలనీలో ఆమె త్రివణ గురుపీఠాన్ని ఏర్పాటు చేశారు. ఈ రోజు త్రివణ గురుపీఠం ప్రారంభోత్సవ కార్యక్రమం పలువురు సినీ, రాజకీయ, ఇతర రంగాల ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా

నిర్మాత హరిత గోగినేని మాట్లాడుతూ – ఈ రోజు త్రివణ గురుపీఠం విజయవంతంగా ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది. వివిధ పూజా కార్యక్రమాలను నిర్విఘ్నంగా పూర్తి చేశాం. త్రివణ గురుపీఠం అనేది డివోషనల్, స్పిరిచువల్, ఆస్ట్రాలజీ కలిపిన ఒక కొత్త మార్గం. సమస్యలు ఉన్నవారికి, అర్థం కాని ప్రశ్నలు ఎదురైన వారికి సమాధానాలు ఇచ్చే విధంగా ఇక్కడ ప్రయత్నిస్తాం. జీవితంలో ఇబ్బందులు ఉన్నవారు, జ్యోతిష్య పరంగా సమస్యలు ఉన్నవారు మా దగ్గరకు వస్తే ఆ సమస్యలు దూరం చేసేందుకు మా వంతు ప్రయత్నం చేస్తాం. ఇక్కడ నవగ్రహాలకు, నవగ్రహ దేవతలతో పాటు ఇతర దేవతా పూజలు రోజూ ఉదయం నుంచి సాయంత్రం 7 గంటల వరకు పద్ధతి ప్రకారం జరుపబడతాయి. అన్ని పూజలు చేసుకోలేని వారికి సహకారం ఇవ్వాలనే పూర్తి నిస్సార్థంగా త్రివణ గురుపీఠం ఏర్పాటు చేశాం.అన్నారు.

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu