ఏదోటి చేయ్ గుర్రం పాపిరెడ్డి…!

అప్పటికున్న కష్టాన్ని దాటేందుకు ఏదో ఒకటి చేయాలి, ముంచేయాలని చూస్తున్న ఏరు దాటేయాలి. ఇలాంటి పరిస్థితే గుర్రం పాపిరెడ్డి, అతని స్నేహితులకు వస్తే ఏదోటి చేయ్ అంటారు, ఏరు దాటేసెయ్ అని ఎంకరేజ్ చేస్తారు. ఇదే సందర్భంలో వచ్చే మంచి బీట్, ర్యాప్ తో ‘ఏదోటి చేయ్ గుర్రం పాపిరెడ్డి..లిరికల్ సాంగ్ డిజైన్ చేశారు. గుర్రం పాపిరెడ్డి సినిమా నుంచి ఈ పాటను ఈ రోజు రిలీజ్ చేశారు మేకర్స్.

‘ఏదోటి చేయ్ గుర్రం పాపిరెడ్డి..’ పాటకు సురేష్ గంగుల క్యాచీ లిరిక్స్ అందించగా, లక్ష్మి మేఘన, ఎంసీ చేతన్ ఎనర్జిటిక్ గా పాడారు. కృష్ణ సౌరభ్ ఆకట్టుకునే ట్యూన్ తో కంపోజ్ చేశారు. గుర్రం పాపిరెడ్డి సినిమాలో నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్నారు.

డా. సంధ్య గోలీ సమర్పణలో ప్రొడ్యూసర్స్ వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ (బాబీ) నిర్మిస్తుండగా… డార్క్ కామెడీ కథతో ఇప్పటి వరకు మనం తెరపై చూడని కాన్సెప్ట్‌తో దర్శకుడు మురళీ మనోహర్ రూపొందిస్తున్నారు. త్వరలో “గుర్రం పాపిరెడ్డి” సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu