Are you drinking coconut water in summer But in danger

Coconut Water: ప్రస్తుతం ఎండాకాలం కొన సాగుతున్న సంగతి తెలిసిందే. ఎక్కడ చూసినా విపరీతంగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచి ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్నం అయితే వడగాడుపులు విపరీతంగా వస్తున్నాయి. దీంతో జనాలు బయట అడుగు పెట్టాలంటే గజగజ వనికి పోతున్నారు. ఏదైనా ఇంపార్టెంట్ పని ఉంటే తప్పితే బయటకు వెళ్లడం లేదు జనాలు. Coconut Water

Are you drinking coconut water in summer But in danger

ఇక ఆఫీస్ కు వెళ్లేవారు చుక్కలు చూస్తున్నారు. ఇక కొంతమంది వడదెబ్బకు మరణిస్తున్నారు. వృద్ధులు అలాగే చిన్నపిల్లలు ఎండలో తిరగకూడదని ప్రభుత్వాలు కూడా హెచ్చరిస్తున్నాయి. అయితే ఈ ఎండాకాలం నేపథ్యంలో చాలామంది కొబ్బరి నీళ్లు తాగుతారు. అయితే ఎండాకాలంలో కొబ్బరి నీళ్లు తాగితే ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి ఇప్పుడు తెలుసుకుందాం. Coconut Water

Also Read: Shawarma: వేడివేడిగా షవర్మా తింటున్నారా?అయితే ఈ వ్యాధులు రావడం గ్యారంటీ !

ఎండాకాలంలో కొబ్బరి నీళ్లు తాగడం చాలా మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఎండాకాలంలో ఈ కొబ్బరినీళ్లు తాగడం వల్ల డీహైడ్రేషన్ కాకుండా ఉంటుంది. ఎక్కువగా దాహం కూడా కాదు. వడదెబ్బ తగలకుండా ఈ కొబ్బరినీళ్లు కాపాడతాయి. జరం ఉన్న కూడా ఈ కొబ్బరినీళ్లు పూర్తిగా తగ్గిస్తాయి. అంతేకాకుండా ఈ ఎండాకాలంలో కొబ్బరి నీళ్లు తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగవుతుంది. తిన్న ఆహారం వెంటనే అరుగుతుంది. Coconut Water

తద్వారా గ్యాస్ మరియు మలబద్ధక సమస్యలు పూర్తిగా తగ్గిపోతాయి. గుండెపోట్లు అలాగే షుగర్ ఉన్నవారు కూడా కొబ్బరి నీళ్లు తాగవచ్చని చెబుతున్నారు వైద్య నిపుణులు. కాబట్టి ఎండాకాలంలో రోజుకు ఒకటి లేదా రెండు రోజులకు ఒకటి అయినా కొబ్బరి బోండా తాగాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే కొబ్బరి బోండా నేరుగా తాగాలి కానీ… ప్లాస్టిక్ బాటిల్లో పార్సల్ తీసుకుపోయి తాగకూడదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దానివల్ల అనేక ప్రమాదకరమైన వ్యాధులు వస్తాయని తెలుపుతున్నారు. Coconut Water

Join WhatsApp