Are you putting Jasmine flowers?

Jasmine flowers: టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్ది అనేక కల్తీలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే కొందరు టెక్నాలజీని మంచిగా ఉపయోగిస్తుంటే మరికొందరు మాత్రం చెడుకు వినియోగిస్తున్నారు. మరీ ముఖ్యంగా పలు రసాయనాలు వాడుతూ వ్యాపారాలు చేస్తూ సొమ్ము సంపాదిస్తున్నారు. కూరగాయలు మరియు పండ్లు, పువ్వులు కొనుగోలు దారులకు అట్రాక్టింగ్ గా కనిపించడానికి పలు రకాల రంగులు వాడుతున్నారు.

Are you putting Jasmine flowers?

ఇక ఇటీవల ఇలాంటి సంఘటనలు చూసి ఉంటాం. అయితే ఇప్పుడు మహిళలు జడలో ఎంతో ఇష్టంగా పెట్టుకునే మల్లెపూల కోసం కూడా రసాయనాలు వాడడం మొదలుపెట్టారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎండాకాలంలో మల్లెపూలు విరివిరిగా అందుబాటులో ఉంటాయి.

Also Read: Kriti Sanon: కృతి సనన్ వేసుకున్న ఆ రెడ్ బ్రాలెట్ ధర అన్ని లక్షలా..?

దీంతో మహిళలు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు లేదా ఏదైనా ఫంక్షన్స్ కు కొనుగోలు చేసి మరి జడలో పెట్టుకుంటూ ఉంటారు. అయితే మల్లెపూలను కాపర్ సల్ఫేట్ లో ముంచి తీస్తున్న వీడియో ఒకటి ప్రస్తుతం ఫుల్ వైరల్ అవుతుంది. వైరల్ అవుతున్న వీడియోలో.. మల్లెపూలు దండలు పట్టుకుని కొందరు వాటిని కోపర్ సల్ఫేట్.. కలిపిన నీటిలో ముంచి ఆ పూలను మరో ట్రేలో వేస్తున్నారు.

Are you putting Jasmine flowers?

అయితే ఇలా చేయడం వల్ల పువ్వులు చాలా సేపు తాజాగా కనిపిస్తాయి. కానీ మహిళలు వీటిని పెట్టుకోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు దరి చేరుతాయి. అదేవిధంగా చర్మ క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. కాపర్ సల్ఫేట్ బల్లాపాలు ఇబ్బందులకు దారితీస్తాయి. మల్లెపూలు కొనకుండా ఇతర పువ్వులు కొన్ని పెట్టుకోవడం మంచిది. లేదంటే డేంజర్ జోన్లో పడినట్లే..!(Jasmine flowers)

Join WhatsApp