Hema: నాగార్జున మా అమ్మాయి ఫంక్షన్ కి వస్తే వెళ్లగొట్టాను.. హేమ షాకింగ్ కామెంట్స్.!

Hema shocking comments on Nagarjuna

Hema: తెలుగు ఇండస్ట్రీలో సీనియర్ నటిమణుల్లో హేమ ఒకరు.. అమ్మ, అత్త, అక్క ఇలా ఎన్నో పాత్రల్లో తనకంటూ ప్రత్యేకమైనటువంటి గుర్తింపు సాధించింది. ఇండస్ట్రీ లోకి వచ్చి దాదాపుగా మూడు దశాబ్దాలు దాటిన హేమ అంద చందాలలో ఏమాత్రం తగ్గకుండా దూసుకెళ్తోంది. ఏ చిత్రంలో అయిన హేమా క్యారెక్టర్ చాలా స్పెషల్ గా ఉంటుంది. కామెడీ చేయడంలో ఈమెకు పెట్టింది పేరు. ముఖ్యంగా బ్రహ్మానందం హేమ కాంబినేషన్ లో ఏదైనా కామెడీ సీన్ ఉందంటే సినిమా చూసే ప్రేక్షకులు పగలబడి నవ్వాల్సిందే.

Hema shocking comments on Nagarjuna

ఆ విధంగా వీరి కాంబినేషన్ ఉంటుంది.. అలాంటి హేమ తాజాగా సినిమా జర్నీ గురించి ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టింది.. అయితే ఆమె ఇండస్ట్రీలో అడుగు పెట్టడానికి ప్రధాన కారణం వాళ్ళ అమ్మా అని చెప్పుకొచ్చింది.. అమ్మకు సినిమాలంటే ఇష్టం.అందుకే నేను ఇండస్ట్రీలోకి వచ్చి ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చాను. ఇప్పటికి నేను ఇండస్ట్రీలో చేయబట్టి 37 సంవత్సరాలు అవుతోంది. కెరియర్ మంచి పొజిషన్ లో ఉండగానే పెళ్లి చేసుకున్నాను. కానీ మా ఆయన చాలా రిజర్వ్డుగా ఉంటారు. పొద్దున్నే లేచి టిఫిన్, లంచ్ ప్రిపేర్ చేసి షూటింగ్ కి వెళ్లే దాన్ని.(Hema)

Also Read: Shoaib Malik: సానియా మీర్జా ఉసురు షోయబ్ మాలిక్ కి తగిలిందా..మూడో పెళ్లి కూడా పెటాకులే.!

తిరిగి రాత్రి వచ్చిన తర్వాత మళ్ళీ వంట చేసేదాన్ని. ఇలా క్షణం తీరిక లేకుండా గడిపిన రోజులు ఎన్నో ఉన్నాయి. లాక్ డౌన్ లో 40 సంవత్సరాల వయసు దాటాను. ఈ టైంలోనే నా శరీరంలో హార్మోన్ లో మార్పులు ఏర్పడి డిప్రెషన్ ఎదురైంది. దీని నుంచి బయటపడేందుకు బిగ్ బాస్ షో కి వెళ్లాను. కానీ వారం రోజులకే ఎలిమినేట్ అయ్యాను. నిజానికి నాగార్జున మాట కి నేనెప్పుడూ కూడా ఎదురు చెప్పను. నా కూతురు సారీ ఫంక్షన్ కు ఆయన అమలతో కలిసి వచ్చారు.

Hema shocking comments on Nagarjuna

దాదాపుగా గంటన్నర సేపు అక్కడే ఉన్నారు. అక్కడికి వచ్చిన మా బంధువులు ఆయనను ఫోటోల కోసం ఇబ్బంది పెట్టడంతో వెళ్ళిపొండి అని బ్రతిమిలాడి పంపించేశాను.. ఇక 2024లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. తప్పు చేయకపోయినా కష్టాల పాలయ్యాను ఒకానొక సమయంలో చచ్చిపోవాలనిపించిందని అంటూ నటి హేమ తెలియజేసింది..ప్రస్తుతం ఆమె చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(Hema)

Share your love