
Venu Swamy: సోషల్ మీడియా, మెయిన్ మీడియాలో ఎక్కడ చూసినా రష్మిక మందన్నా, విజయ్ దేవరకొండ ల ఎంగేజ్మెంట్ గురించే వినబడుతోంది.. ఇద్దరు ఇండస్ట్రీలో మంచి స్టార్ పొజిషన్ లో ఉన్నారు. అలాంటి వీరు గత కొంతకాలంగా లవ్ లో ఉన్నారు. తాజాగా వీరిద్దరూ దగ్గరి కుటుంబీకుల మధ్య ఎంగేజ్మెంట్ చేసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
Venu Swamy sensational comments
కనీసం వీరి ఎంగేజ్మెంట్ కు సంబంధించి ఏ చిన్న ఫోటో కూడా ఎక్కడ లీక్ అవ్వకుండా జాగ్రత్త పడ్డారు. అంతేకాదు వీరి పెళ్లికూడా వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో జరుగుతోందని సమాచారం అందుతుంది. ఇదిలా నడుస్తున్న సమయంలో ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి వీరి పెళ్లి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఇంతకీ ఆయన ఏమన్నారో చూద్దాం.. (Venu Swamy)
Also Read: Vijay Deverakonda: ఆ హీరోయిన్ ఒప్పుకోకపోవడం వల్లే విజయ్ దేవరకొండ రష్మికతో ప్రేమలో పడ్డారా.?
నేను విజయ్ దేవరకొండతో పెళ్లి వద్దంటే రష్మిక వినడం లేదు. మీరు పెళ్లి చేసుకుంటే ఎలాంటి లాభం లేదు. కచ్చితంగా విడాకులు తీసుకుంటారని చెప్పాను. ఒకవేళ వీరిద్దరూ విడాకులు తీసుకోకుండా ఉండాలంటే కొన్ని రెమెడీస్ ఉన్నాయని వాటిని ఫాలో అయితే వారి లైఫ్ బాగుంటుందని అన్నాను. కానీ నేను చెప్పినట్టు వారు వినడం లేదు.

వారి కర్మ వారే అనుభవిస్తారని వదిలేసాను అంటూ వేణుస్వామి అప్పట్లో చెప్పిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో చాలామంది నెటిజన్స్ ఈయన చెప్పేవి చాలా వరకు అబద్ధాలే ఉంటాయి. కనీసం వీరి పెళ్లికూడా జరగలేదు అప్పుడే విడాకుల గురించి మాట్లాడుతున్నారా అంటూ దుమ్మెత్తి పోస్తున్నారు. మరి చూడాలి వేణు స్వామి చెప్పింది నిజమవుతుందా లేదా అనేది ముందు ముందు తెలియబోతుంది..(Venu Swamy)





