మెగా ఫోన్ పడుతున్న సమంత

సమంత హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల ఇటీవల సినిమాలు తగ్గించుకుంది. తన పర్సనల్ లైఫ్ కు టైమ్ కేటాయిస్తానని తెలిపింది. చేసేది తక్కువ సినిమాలే అయినా క్వాలిటీవి చేస్తానని తెలిపింది. సమంత నటిస్తున్న పలు ప్రాజెక్ట్స్ పై టాక్స్ వినిపించాయి. అల్లు అర్జున్ అట్లీ మూవీలో సమంత నటిస్తోందని, అలాగే ఖైదీ 2లోనూ ఆమె కీ రోల్ చేస్తుందని న్యూస్ వైరల్ అయ్యాయి. ఈ చిత్రాల నుంచి కన్ఫర్మేషన్ ఏదీ రాలేదు.

మరోవైపు సమంత కొత్త ప్రయాణం ప్రారంభించబోతుందని ఓ వార్త వైరల్ అవుతోంది. సమంత డైరెక్షన్ చేయాలి అనుకుంటుందట. దీని కోసం ఓ క్యూట్ లవ్ స్టోరీ కూడా రాసిందట. కొంత మందితో దీనికి గురించి చర్చించిందని.. త్వరలోనే ఈ సినిమాని అనౌన్స్ చేయనుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. నటిగా, నిర్మాతగా సక్సెస్ అయ్యింది. ఇప్పుడు దర్శకురాలుగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోనుందని టాక్.

Share your love