మళ్లీ బిజీ అవుతున్న సమంత

సమంత ఒకప్పుడు వరుసగా సినిమాలు చేసింది. ఇప్పుడు మాత్రం చాలా గ్యాప్ తీసుకుంది. హెల్త్ ప్రాబ్లమ్స్ వలన సినిమాలకు ఒక సంవత్సరం గ్యాప్ ఇవ్వాలి అనుకుంది. సంవత్సరం దాటినా కొత్త సినిమాలో నటించలేదు. తను ప్రొడ్యూస్ చేసిన శుభం చిత్రంలో చిన్న రోల్ చేసింది. అల్లు అర్జున్ హీరోగా అట్లీ డైరెక్షన్ లో రూపొందే సినిమాలో సమంత నటించనున్నట్టుగా వార్తలు వచ్చాయి. టీమ్ ఇంకా అనౌన్స్ చేయలేదు.

మరోవైపు సమంత పెద్ది సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేయబోతుందట. అలాగే సమంత ఖైదీ 2 సినిమాలో నటించబోతున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. లోకేష్‌ కనకరాజ్ తెరకెక్కించే ఈ సినిమాని చాలా భారీగా ప్లాన్ చేస్తున్నాడట. త్వరలోనే ఈ సినిమాని ప్రకటిస్తారని టాక్. తన స్నేహితురాలు నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత ఓ సినిమా నిర్మిస్తూ నటించనుందని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్స్ తో సమంత మళ్లీ బిజీ అవుతుందేమో చూడాలి.

Share your love