వారం ముందుగానే నవ్వుల జల్లు

ఇటీవల టీజర్ తో ప్రేక్షకుల్లో బాగా హైప్ క్రియేట్ చేసుకున్న మూవీ లిటిల్ హార్ట్స్. ఈ సినిమా సెప్టెంబర్ 12న రిలీజ్ కు రావాల్సిఉండగా..ప్రీపోన్ అయ్యింది. వారం ముందుగానే సెప్టెంబర్ 5నే థియేటర్స్ లోకి రాబోతోంది. ప్రేక్షకుల ప్రేమతో వారం ముందుగానే థియేటర్స్ లోకి వస్తున్నామంటూ ఈ సందర్భంగా మూవీ టీమ్ తమ హ్యాపీనెస్ షేర్ చేసింది.

లిటిల్ హార్ట్స్ మూవీలో మౌళి తనుజ్, శివానీ నాగరం జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్ పై దర్శకుడు సాయి మార్తాండ్ రూపొందించారు. ఆదిత్య హాసన్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాను నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటి థియేట్రికల్ గా రిలీజ్ చేస్తున్నారు. కామన్ ఆడియెన్స్ లో లిటిల్ హార్ట్స్ సినిమాపై ఆసక్తి ఏర్పడుతోంది.

Share your love