IPL 2026: చెన్నైలోకి సంజు, రాజస్థాన్ లోకి రవీంద్ర జడేజా?

IPL 2026: ఐపీఎల్ 2026 టోర్నమెంట్ కంటే ముందు భారీ డీలింగ్ జరుగుతోంది. ఐపీఎల్ 2026 టోర్నమెంటుకు సంబంధించిన మినీ వేలం డిసెంబర్ 15వ తేదీన జరగనున్న సంగతి తెలిసిందే. దీనికంటే ముందు నవంబర్ 15వ తేదీన రిటైన్ లిస్ట్ ప్రకటించాల్సి ఉంటుంది. ఈ రెండు ప్రక్రియలతో పాటు ట్రేడింగ్ కూడా వినియోగించుకోవచ్చు. IPL 2026

IPL 2026 RR WANTS JADEJA BREVIS IN TRADE OF SAMSON

అయితే ఈ ట్రేడింగ్ ద్వారా సంజు శాంస‌న్ ను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సొంతం చేసుకోవాలని ప్లాన్ చేస్తోంది. భవిష్యత్తులో సంజు శాంస‌న్ కు కెప్టెన్సీ తో పాటు వికెట్ కీపర్ ఇవ్వాలని చెన్నై ప్లాన్. మహేంద్ర సింగ్ ధోని మరో సీజన్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించే ఛాన్స్ ఉంది. దీంతో ఈ సంజు శాంస‌న్ ను కొనుగోలు చేయాలని అనుకుంటున్నారు. IPL 2026

Also Read: Jubilee Hills Bypoll: కాంగ్రెస్ పార్టీపై ముస్లింలు తిరుగుబాటు…రేవంత్ రెడ్డి బెవకూఫ్ అంటూ ?

ఇక ట్రేడింగ్ ద్వారా సంజు శాంస‌న్ స్థానంలో రవీంద్ర జడేజాను రాజస్థాన్ రాయల్స్ అడుగుతోంద‌ట‌. దీనికి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇద్దరికీ కూడా రూ.18 కోట్ల వరకు రెమ్యూనరేషన్ వస్తోంది. కాబట్టి ఈ ట్రేడింగ్ ప్రక్రియ సక్సెస్ అయ్యే ఛాన్సులు కనిపిస్తున్నాయి. చెన్నైకి చెందిన బ్రేవిస్ ను కూడా తీసుకోవాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌. IPL 2026

Also Read: KTR Wife: లగ్జరీ కారులో కేటీఆర్ భార్య..ఆమె ఆస్తులు ఎంతో తెలుసా ?

https://twitter.com/ImTanujSingh/status/1987408531826614284?s=20