
Sathya Sai Baba: ప్రస్తుతం ఏపీలోని పుట్టపర్తిలో సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలు జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ ఉత్సవాల్లో రాజకీయ ప్రముఖులు, సినీ సెలబ్రిటీలు పాల్గొన్నారు.అలా సచిన్ టెండూల్కర్, ఐశ్వర్యారాయ్, ద్రౌపది ముర్ము,నరేంద్ర మోడీ,సిపి రాధాకృష్ణన్, చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, పవన్ కళ్యాణ్, వెంకయ్య నాయుడు ఇలా ఎంతోమంది ప్రముఖులు పాల్గొన్నారు.
Is it Sathya Sai Baba who named that star heroine
అయితే సత్య సాయి బాబా శత జయంతి ఉత్సవాల సందర్భంగా గతంలో ఓ హీరోయిన్ మాట్లాడిన పాత వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఇక ఈ వీడియోలో ఏముందంటే.. సత్యసాయిబాబానే తనకి పేరు పెట్టారట. ఇక సత్య సాయి బాబా తో పేరు పెట్టించుకున్న హీరోయిన్ ఎవరంటే నేచురల్ బ్యూటీ సాయి పల్లవి.. సహజ నటిగా ఇండస్ట్రీలో పేరు సంపాదించిన సాయి పల్లవి పేరుని పెట్టింది స్వయంగా సత్య సాయిబాబానేనట. (Sathya Sai Baba)
ఈ విషయాన్ని సాయి పల్లవి గతంలో ఓ ఇంటర్వ్యూలో బయట పెట్టింది.మా అమ్మకు, అత్తమ్మ, మామయ్యలు అందరికీ కూడా సాయిబాబా అంటే చాలా ఇష్టం.అలాగే వాళ్ళు సాయిబాబా కి చెందిన యూనివర్సిటీలోనే చదివారట. అందుకే నన్ను చిన్నప్పటి నుండి అక్కడికి తీసుకు వెళ్లేవారు.

అలా పుట్టపర్తి సాయిబాబా వారు నన్ను దీవించి సాయి పల్లవి అని పేరు పెట్టారు. నాకు 14, 15 సంవత్సరాలు వచ్చిన టైంలో ఆ నా పేరు నాకు ఎంతో బాగా నచ్చింది.నేను సత్య సాయి బాబా ఆలోచనలతోనే ముందుకు వెళ్తాను. ఆయన నేర్పిన బోధనలు ఎన్నో నాలో ధైర్యాన్ని నింపాయి. నేను కూడా సత్యసాయి బాబా భక్తురాలని అంటూ సాయి పల్లవి మాట్లాడిన పాత వీడియో వైరల్ అవుతుంది.(Sathya Sai Baba)





