
Brahmanandam: బ్రహ్మానందం ఎంత కూల్ అండ్ కామెడీగా ఉంటారో చెప్పనక్కర్లేదు. ఆయన ఎక్కడ ఉన్నా సరే సరదాలు, సంబరాలు,నవ్వులు పూయిస్తూ ఉంటారు.సినిమాల్లోనే కాదు బయట కూడా ఆయన అంతే ఫన్నీగా ఉంటారు. అయితే అలాంటి బ్రహ్మానందం తాజాగా ఓ మాజీ మంత్రిని అవమానించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.ఈ వీడియో చూసిన చాలా మంది నెటిజన్లు పవర్ లేకుంటే అంతే ఎవరికి కనిపించవు అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Brahmanandam insulted the ex minister
మరి ఇంతకీ బ్రహ్మానందం అవమానించింది ఎవరిని.. ఎందుకు అలాంటి పని చేశారు అనేది ఇప్పుడు చూద్దాం.. కామెడీ బ్రహ్మ బ్రహ్మానందం తాజాగా మంచు మోహన్ బాబు కి సంబంధించిన MB50-A Pearl White Tribute అనే ఈవెంట్ లో పాల్గొన్నారు. అయితే ఈ ఈవెంట్ కి ఇండస్ట్రీ నుండి ఎంతోమంది సినీ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా వచ్చారు.(Brahmanandam)
Also Read: Raj-Koti: ఇండస్ట్రీలో ఎన్నో హిట్ సాంగ్స్.. కానీ ఆ ఒక్క సంఘటన వల్ల విడిపోయిన రాజ్-కోటి.?
అయితే బ్రహ్మానందం ఈ ఈవెంట్ కి వస్తున్న సమయంలో అక్కడే ఉన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆయనతో ఫోటో దిగాలని ఎంతో ఆసక్తిగా ముందుకు వచ్చారు. బ్రహ్మానందం చేయి పట్టుకొని మరీ అన్నా ఒక ఫోటో అని అడగగా.. అబ్బే వద్దు అంటూ ఆయన చేతిని నెట్టేసి లోపలికి వెళ్లి పోయారు.

ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారడంతో చాలామంది నెటిజెన్లు బ్రహ్మానందం గారు మరీ అంత వైలెన్స్ ఏంటి..చిన్న ఫోటోనే కదా ఇచ్చేస్తే పోలా కామెంట్లు పెడుతున్నారు. ఇక మరికొంతమంది ఏమో పవర్ లేకుంటే అంతే అందరికీ చులకన అయిపోతాం అంటూ కామెంట్ పెడుతున్నారు.అయితే ప్రస్తుతం ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారంలో లేరు కాబట్టి ఇలాంటి ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.(Brahmanandam)





