Jan Nayakudu: జన నాయకుడుపై దర్శకుడి సంచలన వ్యాఖ్యలు

దళపతి విజయ్ నటించిన చివరి సినిమా అని చెప్పుకుంటున్న జన నాయకుడు (తమిళంలో జన నాయకన్) విడుదలకు సిద్ధమైంది. రాజకీయం, యాక్షన్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా జూలై 23న తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది విజయ్ కెరీర్ లో చాలా స్పెషల్ ప్రాజెక్ట్, అందుకే ఫ్యాన్స్‌ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Jan Nayakudu: Vijay’s Film Update

ఈ సినిమా ‘భగవంత్ కేసరి’ కి రీమేక్ అనే ప్రచారం చాలా ఎక్కువగా జరుగుతోంది. దీనిపై డైరెక్టర్ హెచ్. వినోద్ తన క్లారిటీ ఇచ్చేశాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, జన నాయకుడు పూర్తిస్థాయి రీమేక్ కాదని స్పష్టం చేశాడు. అందులో కొన్ని emotial అంశాలు, మహిళా సాధికారత కాన్సెప్ట్ మాత్రమే భగవంత్ కేసరి నుంచి తీసుకున్నామని చెప్పాడు. మొదటి హాఫ్ లో కొన్ని పోలికలు ఉన్నా, రెండో హాఫ్ పూర్తిగా fresh గా ఉంటుందని వినోద్ అభిప్రాయపడ్డాడు.

విజయ్ స్వయంగా భగవంత్ కేసరి ని 5 సార్లు చూసి, అందులో మహిళా సాధికారత అంశం బాగా నచ్చిందట. అందుకే ఆ భావనను కొత్త కథలో భాగం చేశారు. విజయ్ ఇమేజ్ కు, తమిళ ఆడియన్స్ taste కు తగ్గట్టు స్టోరీ ని completely మేకోవర్ చేశారు. ఇక పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తే, మమితా బైజూ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమా నిజంగా భగవంత్ కేసరి లాగే ఉంటుందా, లేక పూర్తిగా కొత్త experience ఇస్తుందా అనేది జూలై 23 release తర్వాత తేలాల్సి ఉంది.

Share your love