KTR warning: జగన్ ఎలా అంటే కేటీఆర్ కూడా అలానే – అధికారులకు హెచ్చరికలు

కేటీఆర్ ను భయపెట్టిన 'పులివెందుల'

జగన్ మోహన్‌రెడ్డి ఇటీవల తన సహనం కోల్పోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆయన తన పార్టీపై కేసులు పెడితే, తమ కార్యకర్తలను వేధిస్తే పోలీసులతో సహా అధికారులను వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. ఇప్పుడు తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ కూడా అదే బాటలో ముందుకు సాగుతున్నారు.

KTR Warning Retaliates Like Jagan

తాజాగా కేటీఆర్ అధికారులు, పోలీసులను గట్టిగా హెచ్చరించారు. నేను కేసీఆర్ అంత మంచోడిని కాదని, తమ పార్టీ నాయకులపై అక్రమంగా కేసులు పెడితే వదిలిపెట్టేది లేదని చెప్పారు. సప్త సముద్రాలు దాటి వెళ్లినా వెనక్కి తీసుకువచ్చి శిక్షిస్తామని, రిటైరైనప్పటికీ మేం వచ్చాక మిమ్మల్ని వదలం అని వార్నింగ్ ఇచ్చారు. కొన్ని జిల్లాల్లో బీఆర్‌ఎస్ కార్యకర్తలపై కేసులు పెడుతుండటంతో వారు సర్వేలో పాల్గొనడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

పోలీసులు కేసులు పెట్టి కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, ఇలాంటి వారిని తాము వదిలిపెట్టబోమని కేటీఆర్ స్పష్టం చేశారు. అధికార పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలను కూడా హెచ్చరించారు. ప్రభుత్వంలోని పెద్దల మెప్పు కోసం నేతలు అధికారులతో చేతులు కలిపి బీఆర్‌ఎస్ కార్యకర్తలను వేధిస్తున్నారని ఆరోపించారు.

ఏదైనా రాజకీయంగా ఎదుర్కొనేందుకు తాము సిద్ధమేనని, కానీ దొడ్డిదారిలో అధికారులను వినియోగించి వేధిస్తే చర్యలు తప్పవని కేటీఆర్ తేల్చిచెప్పారు. నేను కేసీఆర్ లా మంచోడిని కాదు అన్న వార్నింగ్ ఇవ్వడం గమనార్హం. ఇది రాజకీయంగా పెను దుమారం రేపుతోంది.

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu

PakkaFilmy Telugu తెలుగు రాష్ట్రాల్లో సినిమా, రాజకీయాలు మరియు ట్రెండింగ్ వార్తలను అందించే ఒక డిజిటల్ న్యూస్ డెస్క్. మా ఎడిటోరియల్ టీమ్ ప్రతిరోజూ అందుబాటులో ఉన్న సోర్సుల నుండి సమాచారాన్ని సేకరించి, తెలుగు పాఠకుల కోసం సులభమైన భాషలో వార్తలుగా అందిస్తుంది. మమ్మల్ని ఇక్కడ కూడా ఫాలో అవ్వండి — X (Twitter): https://x.com/pakkafilmy007 | Telegram: https://t.me/pakkafilmytelugu | Instagram: https://instagram.com/pakkafilmy_