Janhvi Kapoor: రూ.2.5 కోట్ల వాచ్‌తో వెడ్డింగ్‌లో స్టన్నింగ్ లుక్ లో జాన్వీ కపూర్!!

జాన్వీ కపూర్ మళ్ళీ తన స్టైల్తో అందరినీ అబ్బురపరిచింది. తన సోదరి అన్షులా కపూర్ వివాహ వేడుకలో ఆమె ధరించిన luxury watch ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆమె చేతిలో మెరిసిన పాటెక్ ఫిలిప్ వాచ్ ధర ఏకంగా రూ.2.5 కోట్లు అని తెలుస్తుండటంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు.

అన్షులా మెహందీ వేడుకలో జాన్వీ బ్లష్ పింక్ వన్-షోల్డర్ గౌన్ లో స్టన్నింగ్ గా కనిపించింది. మింట్ గ్రీన్, పౌడర్ బ్లూ, పీచ్ కలర్స్ లో ఫ్లోరల్ ఎంబ్రాయిడరీ, ఫ్రింజ్ టాసెల్స్ ఉన్న ఈ గౌన్ చీరను గుర్తు చేసే మోడ్రన్ డిజైన్ తో ఉంది. ఆమె గ్రీన్ జుమ్కాలు, సాఫ్ట్ మేకప్, ఓపెన్ హెయిర్ వేవ్స్ తో లుక్ ను పూర్తి చేసింది.

కానీ ఈసారి ఆమె డ్రెస్సింగ్ ను కూడా మించి ఆ luxury watch నే అందరూ ఫోకస్ చేస్తున్నారు. ఇది పాటెక్ ఫిలిప్ బ్రాండ్ లోని హాట్ గోండోలో క్లేర్ పెర్ల్ మోడల్ అని ఫ్యాషన్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. దీని యూనిక్ ఫీచర్లు చూస్తే, డయల్ మీద 251 డైమండ్స్, స్ట్రాప్ పై 79 అకోయా పెర్ల్స్ పొదిగించారు. 18 క్యారెట్ల రోజ్ గోల్డ్ తో తయారైన డయల్ కు డైమండ్ ఫినిషింగ్ ఇవ్వడంతో ఈ లగ్జరీ వాచ్ రాయల్ లుక్ ను సంతరించుకుంది.

సోషల్ మీడియాలో ఈ లుక్ వైరల్ కావడంతో జాన్వీకి అభిమానులు ఫిదా అవుతున్నారు. ఆమె ఎంపిక చేసిన యాక్సెసరీస్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ luxury watch మరియు ఆమె సింపుల్ గా కనిపించే స్టైల్ కలయిక అభిమానుల మనసును దోచేసింది. జాన్వీ మరోసారి తన ఫ్యాషన్ సెన్స్ ను ప్రూవ్ చేసింది.

Share your love