Protein Powder: ప్రోటీన్ పౌడర్ కొంటున్నారా? డైటీషియన్ చెప్పిన 5 ట్రిక్స్!!

ప్రోటీన్ పౌడర్ ఇప్పుడు జిమ్ వాళ్లకే కాదు, సామాన్యుల ఆహారంలో కూడా భాగమైపోయింది. కానీ ఏ ప్రోటీన్ పౌడర్ ఐనా ఆరోగ్యకరమైందేనా? అన్నది పెద్ద ప్రశ్న. డైటీషియన్ వీణా V మాట్లాడుతూ, మార్కెటింగ్ ట్రిక్స్‌కు లోనై చాలామంది తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారని అంటున్నారు. ప్రోటీన్ పౌడర్ కొన్నప్పుడు గమనించాల్సిన ఐదు ఎర్ర జెండాల గురించి ఆమె వివరించారు.

ముందుగా, చక్కెర కంటెంట్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని ప్రోటీన్ షేక్స్‌లో ఒక్కో సర్వింగ్‌కు 15 నుంచి 25 గ్రాముల వరకు చక్కెర ఉంటుంది. ఇది బరువు పెరగడానికి కారణమవుతుంది, బ్లడ్ షుగర్ లెవల్స్‌ను అస్థిరపరుస్తుంది. రెండోది, పదార్థాల జాబితా చాలా పొడవుగా ఉంటే అది ప్రాసెస్ చేసిన ఉత్పత్తికి సంకేతం. ఆర్టిఫిషియల్ కలర్స్, ప్రిజర్వేటివ్స్, ఫిల్లర్స్ ఏమాత్రం అవసరం లేనివి. మూడోది, హిడెన్ స్టిములెంట్స్ – కొన్ని పౌడర్లలో కెఫిన్, ఫ్యాట్ బర్నింగ్ బ్లెండ్స్ ఉంటాయి, ఇవి నిద్రలేమికి, గుండె దడకు దారితీయవచ్చు.

నాలుగోది, భోజనాన్ని ప్రోటీన్ షేక్‌తో రీప్లేస్ చేయడం తప్పు. ప్రోటీన్ పౌడర్ ఆహారానికి సప్లిమెంట్ మాత్రమే, రీప్లేస్మెంట్ కాదు. ఇందులో ఫైబర్, విటమిన్స్, మినరల్స్ ఉండవు. ఐదోది, చాలామందికి డైలీ ప్రోటీన్ నీడ్స్ వారి రెగ్యులర్ డైట్ నుంచే తీరుతాయి. అవసరం లేకపోయినా ప్రోటీన్ పౌడర్ తీసుకుంటే అది ఎక్స్ట్రా కేలరీలుగా మారుతుంది. మార్కెటింగ్ కంటే మీ బాడీ నీడ్‌ని బేస్ చేసుకుని ప్రోటీన్ పౌడర్ ఎంచుకోండి అని వీణా సూచిస్తున్నారు.

Share your love