

KCR: తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చాలా రోజుల తర్వాత బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. తెలంగాణ ప్రజలు బయటకు రావాలని ఎంత కోరిన రాకపోయినా కేసిఆర్, పార్టీ పరిస్థితుల దృష్ట్యా బయటకు వచ్చి మాట్లాడారు. దాదాపు రెండు గంటల పాటు ప్రెస్ మీట్ పెట్టిన కేసీఆర్, సీఎం రేవంత్ రెడ్డి అలాగే అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సినిమా చూపించేశారు. KCR
KCR counter to chandrababu ycp fulll happy
డీలా పడిపోయిన వైసీపీ పార్టీకి ప్రాణం పోశారు కేసీఆర్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తొలినాళ్లలో ఏపీకి చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో విశాఖపట్నంలో గ్లోబల్ సబ్మిట్ లాగానే పెట్టుబడి దారులను తీసుకువచ్చి చంద్రబాబు హడావిడి చేసినట్లు గుర్తు చేశారు కేసీఆర్. ఆ సమయంలో కోట్లల్లో పెట్టుబడులు వచ్చినట్లు చంద్రబాబు డబ్బా కొట్టాడని వెల్లడించారు కేసీఆర్. కానీ క్యాటరింగ్ చేసే సిబ్బందిని తీసుకువచ్చి వాళ్లతో సంతకాలు పెట్టించి.. వాళ్లే పెట్టుబడుదారులు అన్న రేంజ్ లో సీన్ క్రియేట్ చేశాడని సీక్రెట్ రివిల్ చేశారు. KCR
Also Read: Jagan-Sharmila: జగన్ తో కలిసిపోయిన వైఎస్ షర్మిల..షాకింగ్ ట్వీట్ వైరల్ ?
ఆ హోటల్లో పని చేసే వాళ్ళతో Mou కుదుర్చుకొని కోట్లల్లో పెట్టుబడులు వచ్చినట్లు ప్రజలను మోసం చేశాడని చురకలు అంటించారు. ఈ విషయం భోపాల్ లో తనకు తెలిసిందని గుర్తు చేశారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా అలాగే గ్లోబల్ సమ్మిట్ పెట్టి డబ్బా కొట్టుకుంటున్నాడని విమర్శలు చేశారు. అయితే చంద్రబాబుపై కేసీఆర్ విమర్శలు చేయడంతో వైసిపి పార్టీ రేంజ్ లో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతోంది. చంద్రబాబు పరువు కేసీఆర్ తీశాడని సెటైర్లు పేల్చాతు రెచ్చిపోతుంది. వైయస్ జగన్మోహన్ రెడ్డి బర్త్ డే కానుకగా కేసీఆర్ తమకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడని వైసీపీ శ్రేణులు కూడా సంబరాలు చేసుకుంటున్నారు. KCR
Also Read: HYDRA Ranganath: వివాదంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ? గన్‌మ్యాన్ ఆత్మ**త్యాయత్నం







