Kadiyam Srihari: రాజకీయ సన్యాసం తీసుకోనున్న కడియం శ్రీహరి.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటన ?

Kadiyam Srihari: కడియం శ్రీహరి సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యేగా మొన్నటి ఎన్నికల్లో గులాబీ పార్టీ నుంచి గెలిచిన కడియం శ్రీహరి.. ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్న సంగతి తెలిసిందే. పార్టీ మారిన కడియం శ్రీహరి పై గులాబీ పార్టీ పోరాటం చేస్తూనే ఉంది. ఏ క్షణమైనా కడియం శ్రీహరి పై వేటు పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. Kadiyam Srihari

Also Read: Kalvakuntla Kavitha: BRS నేత‌లు నాతో ట‌చ్ లో ఉన్నారు

Kadiyam Srihari to take political sannyas

దీంతో కడియం శ్రీహరి ఎన్నికలకు రావాలని… గులాబీ పార్టీ అభ్యర్థి తాటికొండ రాజయ్య… నిత్యం ప్రెస్ మీట్ పెట్టి సవాల్ విసురుతున్నారు. అయితే… తాటికొండ రాజయ్య సవాల్ కు ప్రతి సవాల్ కడియం శ్రీహరి నుంచి రావడం లేదు. పదేపదే రాజయ్య తిట్టడంతో తాజాగా కడియం శ్రీహరి సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని కడియం శ్రీహరి… నిర్ణయం తీసుకున్నారట. ఈ మేరకు… గులాబీ పార్టీ సోషల్ మీడియాలో వార్త వైరల్ అవుతుంది.

Also Read: Teenmar Mallanna: తీన్మార్ మ‌ల్ల‌న్న వెనుక కేసీఆర్‌…పార్టీ పేరుతో స్కెచ్ ?

అయితే కడియం శ్రీహరి పోటీ చేయకుండా ఆయన కూతురిని బరిలో దింపే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే వరంగల్ ఎంపీగా ఆమె కొనసాగుతున్నారు. ఆయన తండ్రి తప్పుకుంటే ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు కడియం కావ్య సిద్ధంగానే ఉన్నారని సమాచారం. అయితే ప్రాథమిక సమాచారం ప్రకారం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అక్కడ గులాబీ పార్టీ జెండా ఎగురవేయడం ఖాయమని సర్వేలు చెబుతున్నాయి.

Also Read: Toothbrush: ఒకే బ్రష్ లను ఎక్కువ రోజులు వాడుతున్నారా…అయితే ప్ర‌మాద‌మే?